తెలుగు న్యూస్ ఛానల్లో AI యాంకర్ మాయ: రియల్ యాంకర్లకు ఆర్టిఫీషియల్ ఇంటలిజన్స్ షాక్!!

తెలుగు న్యూస్ ఛానల్లో AI యాంకర్ మాయ: రియల్ యాంకర్లకు ఆర్టిఫీషియల్ ఇంటలిజన్స్ షాక్!!

తెలుగు న్యూస్ ఛానల్లో AI యాంకర్ మాయ; రియల్ యాంకర్లకు ఆర్టిఫీషియల్ ఇంటలిజన్స్ షాక్!!

మీడియాలో యాంకర్లకు కొత్త కష్టాలు కనిపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ల ఉద్యోగాలకి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. వార్తలు చదవడానికి ఒరియాలో కృత్రిమ మేధస్సును ఇప్పటికే ప్రయోగించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఓటీవీ ఓ న్యూస్ యాంకర్‌ను రూపొందించింది.

ఒడిశాలోని ఒక ప్రైవేట్ న్యూస్ ఛానెల్ లీసాతో వార్తలను చదివే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్‌ని సృష్టించింది. ఇక అదే విధంగా తెలుగు మీడియాలో సంచలనానికి తెరలేపింది బిగ్ టీవీ. ఇప్పటి వరకు ఏ తెలుగు టీవీ ఛానెల్‌లోనూ లేని విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో న్యూస్ యాంకర్‌ను రూపొందించింది బిగ్ టీవీ.

బిగ్ టీవీ సృష్టించిన వర్చువల్ న్యూస్ యాంకర్ పేరు మాయ. ఈ న్యూస్ యాంకర్ తెలుగులో వార్తలను స్పష్టంగా చదువుతోంది. ఈ వర్చువల్ న్యూస్ యాంకర్ చక్కని కట్టు మరియు బొట్టుతో అందంగా కనిపిస్తోంది. న్యూస్ యాంకర్లకు పోటీగా వార్తలు చదువుతుంది. ఈ వర్చువల్ యాంకర్ మాయ తెలుగులో వార్తలు చదవడానికి ప్రోగ్రామ్ చేయబడింది.

న్యూస్ ఛానళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా యాంకర్లను సృష్టిస్తున్నాయి, ఇది యాంకర్ల జీవనోపాధిపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే చాలా మంది నిరుద్యోగంతో బాధపడుతున్నారంటే, కృత్రిమ మేధ వల్ల నిరుద్యోగిత రేటు పెరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతికత అభివృద్ధి చెందిందని సంతోషించాలా.. మానవ వనరుల వినియోగం తగ్గిపోతున్నందుకు బాధపడాలా అనేది అర్థం కావడం లేదు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ విధంగా వర్చువల్ యాంకర్లను తయారు చేయడం ప్రారంభిస్తే, ఈ ప్రయోగం విజయవంతమైతే, డబ్బు సంపాదించడానికి టెలివిజన్ రంగంలో పనిచేస్తున్న చాలా మంది యాంకర్లు రోడ్డున పడవలసి వస్తుంది. అయితే, తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేయగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి మీడియా టెక్నాలజీలో దూసుకుపోవాలని ప్రయత్నిస్తోంది. ఇది యాంకర్లకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది..

First Telugu Demo AI News Anchor In T News Telugu Channel

Flash...   Artificial Intelligence: ‘AI’తో అద్భుతాలు.. ఏ పరీక్ష పెట్టినా పాస్ గ్యారంటీ.. రానున్న ఐదేళ్లలోనే..