ఇద్దరు SGT ఉపాధ్యాయులను ప్రభుత్వానికి సరెండర్ చేసిన కలెక్టర్

ఇద్దరు SGT ఉపాధ్యాయులను ప్రభుత్వానికి సరెండర్ చేసిన కలెక్టర్
Illustration of suspended word sign flat concept

సాక్షి, పాడేరు: విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు SGT ఉపాధ్యాయులపై కలెక్టర్ సుమిత్ కుమార్ కఠిన చర్యలు చేపట్టారు. పెదబయలు మండలం లోని సంపంగిపుట్టు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో SGT లు గా పనిచేస్తున్న కోనాడ విజయలక్ష్మి, రోంగలి శంకరరావులను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఆయన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 17న అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ సంపంగిపుట్టు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్ర మాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా గ్రామస్తులు పాఠశాల ఉపాధ్యాయులపై ఫిర్యాదు చేశారు. ఈ విష యాన్నిఆయన కలెక్టర్ డీఈవోల దృష్టికి తీసుకువె ళ్లారు. ఈనేపథ్యంలో ఉపాధ్యాయుల పనితీరుపై సమ గ్ర విచారణకు డీఈవోను కలెక్టర్ ఆదేశించారు. మం కల విద్యాశాఖాధికారి ఇద్దరు ఎసిటీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. డీఈవో సమగ్ర విచారణ నివేదిక ను కలెక్టర్కు అందించారు. ఉపాధ్యాయుల విధి నిర్వ హణలో నిర్లక్ష్యాన్ని తప్పుబట్టిన కలెక్టర్కు వారిని ప్ర భుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 ఈ ఇద్దరు SGT లు పాఠశాలకు వెళ్లకుండా, ఓ వలం టీర్ ఏర్పాటు చేసుకుని పాఠశాల నడుపుతున్నారని విచారణలో గుర్తించారు. నాడు- నేడు పాఠశాలల పను లు సక్రమంగా జరగలేదని, పిల్లలకు మధ్యాహ్న భోజ నం అందించడంలోను వారు విఫలమయ్యారని రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి పంపిన లేఖలో కలెక్టర్ పేర్కొన్నా రు. సంపంగిపుట్టు పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని డీఈవోను కలెక్టర్ ఆదేశించారు.

Flash...   Child Care Leave for Women employees - Child Care leave Application