టీచర్లకు నకిలీ బదిలీ ఉత్తర్వులు.. DEO ఆఫీస్ సిబ్బంది సస్పెండ్ !
ఒంగోలు: ఇద్దరు ఉపాధ్యాయులకు నకిలీ బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన వ్యవహారం ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. జిల్లా విద్యా శాఖ కార్యా లయం వేదికగా ఈ బదిలీ ఉత్తర్వులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేశ్కుమార్ గురు వారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఈవో పి.రమేశ్ను హెడాక్వార్టర్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
♦️ఆఫ్లైన్లో నకిలీ ఉత్తర్వుల జారీ
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ వారి అర్హతలను బట్టి బదిలీ స్థానాలు కేటాయించారు. కానీ కంభం, బల్లికురవ మండలాల్లోని ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు మాత్రం ఆఫ్లైన్ ఉత్తర్వులు అందుకున్నారు. వాటి ఆధారంగా పాఠశాలల్లో చేరారు. అనంతరం వారికి పదోన్నతులు లభించి హెడ్మాస్టర్లుగా కూడా వేర్వేరు పాఠశాలలకు వెళ్లిపోయారు. ఆన్లైన్లో బదిలీ ఉత్త ర్వులు అందుకున్నవారి సంఖ్యకు, నూతన స్థానాల్లో చేరిన వారి సంఖ్యకు మధ్య ఇద్దరు అధికంగా ఉండ టం ఆర్జేడీ దృష్టికి వచ్చింది. దీంతో వాటన్నింటినీ పరిశీలించి కంభం, బల్లికురవ మండలాల్లో ఇద్దరికి పోస్టింగ్లు ఎలా వచ్చాయనేది అర్థంగాక సంబం ధిత కాపీలను తెప్పించుకుని పరిశీలించారు. దీం తో అవి ఆఫ్లైన్లో జారీ అయిన నకిలీ ఉత్తర్వులని తేలింది. అందుకు బాధ్యులైన డీఈవో కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ కె.ఉదయభాస్కర్, సెక్షన్ సూప రింటెండెంట్ ఎస్.సురేశ్, స్కూల్ అసిస్టెంట్ గిరిలను సస్పెండ్ చేశారు.