Hollywood Shutdown: హాలీవుడ్‌ను తాకిన ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సెగ .. నటీనటుల నిరవధిక సమ్మె!

Hollywood Shutdown: హాలీవుడ్‌ను తాకిన ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సెగ .. నటీనటుల నిరవధిక సమ్మె!

AI ఇప్పుడు ఈ ఒక్క మాటే అందరి నోటా వినిపించేది . అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇటీవలే యాంకరమ్మ కూడా పరిచయమైంది. తాజాగా ఈ సెగ హాలీవుడ్‌ను తాకింది. AI వచ్చి హాలీవుడ్‌లో హల్ చల్ చేస్తోంది. హాలీవుడ్‌లోని స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు ఆందోళనలకు పిలుపునిచ్చింది. AI నుండి తమను రక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మెతో హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు మరింత ఆలస్యంగా విడుదల కానున్నాయి.

ప్రొడక్షన్ స్టూడియోలతో జరిపిన చర్చలు విఫలమవడంతో గురువారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. దాదాపు 1,60,000 మంది నటీనటులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ డిమాండ్లతో అమెరికాలోని రైటర్స్ గిల్డ్ కూడా గత 11 వారాలుగా సమ్మెకు దిగింది. ఇటీవల నటీనటులు సమ్మె చేయడంతో హాలీవుడ్ చిత్ర పరిశ్రమ మూతపడింది. చివరిసారిగా 1980లో నటీనటుల సంఘం మూడు నెలలకు పైగా సమ్మె చేసింది. ఈ సమ్మె ఇలాగే కొనసాగితే పెద్ద సినిమాల విడుదల కూడా వాయిదా పడే అవకాశం ఉంది.

Flash...   ఎంత కావాలంటే అంత జీతం.. AI నేర్చుకోండి: కంపెనీల బంపరాఫర్