ఒకరికి ఇవ్వవలసిన ప్రమోషన్ ఇంకొకరికి : సస్పెన్షన్ వేటు

ఒకరికి ఇవ్వవలసిన ప్రమోషన్ ఇంకొకరికి : సస్పెన్షన్ వేటు

రాప్తాడురూరల్: పదోన్నతుల జాబితాలో సిబ్బంది మతలబు చేశారు. సీనియర్ టీచర్ పేరును జాబి తాలో చేర్చకుండా జూనియర్కు పదోన్నతి కల్పిం చారు. సీనియర్ అడ్డు చెప్పడంతో రాత్రికి రాత్రి ఆమెకు మార్చారు. ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించిన డీఈఓ సాయిరాం సీనియర్ అసిస్టెం ట్పై సస్పెన్షన్ వేటు వేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా.. ఎస్ఏ (గణితం) పదోన్నతుల కౌన్సెలింగ్ ఈనెల 6న జరిగింది. సీని యార్టీ జాబితాలో తనకల్లు మండలంలో పనిచేస్తున్న ప్రభావతి పేరు లేదు. ఆ తర్వాత ఉన్న బి. సురేఖ కౌన్సెలింగ్కు హాజరై ప్రమోషన్ తీసుకుని విరుపా పల్లి ఎంపీయూపీఎస్ కోరుకున్నారు. సంతకం చేసి వెళ్లిపోయారు. అయితే, సాయంత్రం 6.30 గంటల సన్నయంలో ప్రభావతి డీఈఓ కార్యాలయ సిబ్బంది వద్దకు వచ్చి, తనపేరు లేకుండా జూనియర్ పేరును ఎలా చేర్చారని ప్రశ్నించారు. దీంతో సురేఖకు ఫోన్ చేసి ప్రమోషన్ రద్దు చేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. ఆ తర్వాత ప్రభావతికి ఇచ్చి పంపారు. విషయం డీఈఓకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. తర్వాత రోజు డీఈఓను కలిసిన సురేఖ.. సీనియార్టీ జాబి తాలో పేరులేని, కౌన్సెలింగ్కు హాజరుకాని టీచరుకు ఎలా ప్రమోషన్ ఇస్తారని వాపోయారు. వాస్తవంగా సీనియర్గా ఉన్న వారికే ప్రమోషన్ ఇవ్వాల్సి ఉం టుందని డీఈఓ చెప్పారు. సీనియార్టీ జాబితా తయారు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. విధుల పట్ల అలసత్వం ప్రదర్శించినట్లు గుర్తించి సీనియర్ అసి స్టెంట్ ప్రదీప్ కుమార్ను సస్పెండ్ చేస్తూ మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు.

Flash...   Limiting the duties of the field functionaries to the School Education - Instructions