Rain Alert: తెలుగు రాష్ట్రాలకు డబుల్‌ వార్నింగ్‌.. మరో ఐదు రోజులపాటు కుండపోత వర్షాలు..!

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు డబుల్‌ వార్నింగ్‌.. మరో ఐదు రోజులపాటు కుండపోత వర్షాలు..!

Heavy Rain alert: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ మరో హెచ్చరిక చేసింది. ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనానికి తోడు రేపు మరో ద్రోణి ఏర్పడనుందని బాంబు పేల్చారు. రెట్టింపు అల్పపీడన ద్రోణిలతో మరో 5 రోజుల పాటు కుండపోత వర్షాలు తప్పవని హెచ్చరించింది. తెలంగాణతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ బెల్ మోగింది. అల్పపీడనం కారణంగా బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉందని, సముద్రంలో వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదని వాతావరణ శాఖ చెబుతోంది. తీరం వెంబడి గంటకు 50 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. మరో నాలుగు రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది.


ప్రస్తుతం తెలంగాణలో వర్షాలు కొద్దిగా తగ్గాయి! రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ నుంచి ఎల్లో అలర్ట్ వరకు తీవ్రత తగ్గింది. తెలంగాణలోని 15 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ తెలిపింది. ఇంకా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించినా.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల తీవ్రత కొద్దిగా తగ్గింది. అయితే ఇది తాత్కాలికమేనని వాతావరణ శాఖ చెబుతోంది. ఏపీ, తెలంగాణలకు ఇంకా ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఎప్పుడయినా మళ్లీ వరుణుడు విరుచుకుపడడం ఖాయమని వార్నింగ్ ఇస్తోంది. వరుణుడు విరామం ఇచ్చాడని, విశ్రాంతి తీసుకోవద్దని, మరో 5 రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD చెబుతోంది.

Flash...   AP లో మరో రెండ్రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్