Chandrayaan 3: విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగాక దేనికోసం పరిశోధన చేస్తుంది?

Chandrayaan 3: విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగాక దేనికోసం పరిశోధన చేస్తుంది?
vikram lander

విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగాక దేనికోసం పరిశోధన చేస్తుంది, ఎలా కమ్యూనికేట్ చేస్తుంది?

CHANDRAYAN-3  చాలా కష్టం అయిన ప్రయోగం. అమెరికా, రష్యా, చైనా సహా వేరే ఏ దేశమూ ఇప్పటిదాకా చేరుకోలేకపోయిన చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరుకోవటానికి ఈ ప్రయోగంలో భారత్‌ తన లక్ష్యంగా ఎంచుకుంది . అలాగే యావత్ ప్రపంచం ఆత్రుత గా భరత్ వైపు చూసేట్టు చేసిన ఘనత .. మనది .

చంద్రుని దక్షిణ ధ్రువం పై అనుకున్నట్టే ఆగష్టు 23 న సాయంత్రం 6 గంటల సమయం లో విక్రమ్ లాండర్ చంద్రుని దక్షిణ ధ్రువం పై సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. మన ప్రయోగం విజయవంతం అయ్యింది . ప్రపంచ దేశాల్లో భరత్ మొత్త్తమొదటి దేశము గా నిలిచింది

చంద్రయాన్‌-3 లో కీలక సాధనాలు ఏమిటి ?

చంద్రయాన్‌-3లో ఏ ఏ భాగాలున్నాయి? కఠిన సవాళ్లు చేధించేందుకు దానిలో ఉపయోగిస్తున్న అత్యాధునిక పరికరాలేంటి? చంద్రుని పై పరిశోధనలకు అవి ఎలా ఉపయోగపడబోతున్నాయి? ఆ వివరాలను ఒక సారి చూద్దాం…

ముఖ్యం గా ఇది మూడింటి కలయిక..

చంద్రయాన్‌-3 లో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి. అవి..

  • 1) ప్రొపల్షన్‌ మాడ్యూల్‌,
  • 2) ల్యాండర్‌,
  • 3) రోవర్‌

ఈ మూడూ సమన్వయంతో పనిచేస్తేనే ఇస్రో కంటున్న చదనరుని దక్షిణ ధ్రువం కలలు నెరవేరతాయి. అందుకోసం వీటిని అత్యాధునిక టెక్నాలజీ తో రూపొందించారు. వాటిలో ఉప పరికరాలను మోహరించారు.

1.ప్రొపల్షన్‌ మాడ్యూల్ ఎలా ప‌నిచేస్తుంటే..?

ఇది పెట్టె ఆకృతిలో ఉంటుంది. దీనికి ఒకవైపున భారీ సౌరఫలకాన్ని ఏర్పాటుచేశారు. పైభాగంలో సిలిండర్‌ ఆకృతిలో ఇంటర్‌మాడ్యూల్‌ అడాప్టర్‌ కోన్‌ ఉంటుంది. ఈ భాగానికే ల్యాండర్‌ను అమరుస్తారు. దీనికింద ప్రొపల్షన్‌ వ్యవస్థ, ప్రధాన థ్రస్టర్‌ నాజిల్‌ ఉంటాయి.

ప్రొపల్షన్‌ మాడ్యూల్‌లో ‘స్పెక్ట్రోపొలారీమెట్రీ ఆఫ్‌ హ్యాబిటబుల్‌ ప్లానెట్‌ ఎర్త్‌’ (షేప్‌) అనే పేలోడ్‌ ఉంటుంది. అది చంద్రుడి కక్ష్యలో ఉంటూ.. భూమి నుంచి పరావర్తనం చెందిన కాంతిని విశ్లేషిస్తుంది. స్పెక్ట్రల్‌, పొలారిమెట్రిక్‌ కొలతలు సేకరిస్తుంది. ఈ డేటాను.. ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల (ఎక్సో ప్లానెట్స్‌)పై పరిశోధనకు ఉపయోగిస్తారు. అక్కడ భూమి తరహాలో నివాసయోగ్య పరిస్థితులు ఉన్నాయా.. ఇప్పటికే అక్కడ జీవం ఉందా అన్నది తెలుసుకోవడానికి ఉపయోగించనున్నారు.ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ చంద్రుడి కక్ష్యలోనే ఉంటూ ల్యాండర్‌కు భూ కేంద్రానికి మధ్య కమ్యూనికేషన్‌ ప్రసార ఉపగ్రహంలా పనిచేస్తుంది. చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌.. దీనికి బ్యాకప్‌గా వ్యవహరిస్తుంది.

Flash...   మీ Gmail నిండిపోయిందా? ఇలా ఈజీ గా క్లీన్ చేయొచ్చు!

2. ల్యాండర్ ఎలా ప‌నిచేస్తుంటే..?

ఈ సాధనానికి నాలుగు కాళ్లు, నాలుగు ల్యాండింగ్‌ థ్రస్టర్లు (రాకెట్లు) ఏర్పాటుచేశారు. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా దిగడానికి అవసరమైన కెమెరాలు, సెన్సర్లు అమర్చారు. అవి ప్రమాదకరమైన అవరోధాలను తప్పించుకోవడానికి, ల్యాండర్‌కు తాను ఎక్కడ ఉన్నానన్న విషయం తెలియజేయడానికి ఉపయోగపడతాయి. కమ్యూనికేషన్‌ కోసం ఎక్స్‌ బ్యాండ్‌ యాంటెన్నా ఉంటుంది. ల్యాండర్‌లో 800 న్యూటన్ల సామర్థ్యం కలిగిన నాలుగు థ్రాటల్‌బుల్‌ ఇంజిన్లు, 58 న్యూటన్ల సామర్థ్యం కలిగిన 8 థ్రాటల్‌బుల్‌ ఇంజిన్లు ఉన్నాయి.

ల్యాండర్‌లో మొత్తం ఐదు పరికరాలు ఉన్నాయి. .
అవి..

1. చంద్రాస్‌ సర్ఫేస్‌ థర్మోఫిజికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (చేస్ట్‌): చంద్రుడి కండక్టివిటీ, ఉష్ణోగ్రతలను కొలుస్తుంది.

2. ఇన్‌స్ట్రూమెంట్‌ ఫర్‌ లూనార్‌ సైస్మిక్‌ యాక్టివిటీ (ILSA): ల్యాండింగ్‌ ప్రదేశంలో చంద్రుడి ప్రకంపనలను కొలవడానికి ఉపయోగపడుతుంది. చందమామ క్రస్టు, మ్యాంటిల్‌ పొరల తీరుతెన్నులను వెలుగులోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది.

3. లాంగ్‌ముయిర్‌ ప్రోబ్‌: ప్లాస్మా సాంద్రత, దాని వైరుధ్యాలను లెక్కిస్తుంది.

4. ప్యాసివ్‌ లేజర్‌ రెట్రోరిఫ్లక్టర్‌ అరే (LRA): దీన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అందించింది. ఇది చంద్రుడికి సంబంధించిన రేంజింగ్‌ అధ్యయనాల కోసం ఉపయోగపడుతుంది.

5. రేడియో అనాటమీ ఆఫ్‌ మూన్‌ బౌండ్‌ హైపర్‌సెన్సిటివ్‌ అయనోస్పియర్‌ అండ్‌ అట్మాస్పియర్‌ (రంభా): చంద్రుడిపైన ఉండే గ్యాస్‌, ప్లాస్మా వాతావరణం గురించి శోధిస్తుంది.

3. రోవర్ ఎలా ప‌నిచేస్తుంటే..?

ఇది దీర్ఘచతురస్రాకార ఆకృతిలో.. ల్యాండర్‌లోని ఒక ఛాంబర్‌లో ఉంటుంది. ర్యాంప్‌ ద్వారా లోపలి నుంచి చంద్రుడి ఉపరితలంపైకి వస్తుంది. చందమామపై సాఫీగా కదలడం కోసం దానికి ఆరు చక్రాలు, మార్గనిర్దేశం కోసం నావిగేషన్‌ కెమెరాను అమర్చారు. సైన్స్‌ పరిశోధనల కోసం ఇందులో ఆల్ఫా పార్టికిల్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, లేజర్‌ ఇండ్యూస్డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కొపీ అనే పరికరాలను ఏర్పాటు చేశారు. అవి ల్యాండింగ్‌ ప్రాంతంలో మూలకాల గురించి శోధిస్తాయి. ఆర్‌ఎక్స్‌/టీఎక్స్‌ యాంటెన్నాల ద్వారా నేరుగా ల్యాండర్‌తో రోవర్‌ కమ్యూనికేషన్‌ సాగించగలదు.

ఇవి ఎంతకాలం పనిచేస్తాయంటే..?

MOON ఉపరితలంపై విజయవంతంగా దిగాక LANDER, ROVER.. అక్కడి ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని ఎంతకాలం పనిచేస్తాయన్నది ఇప్పుడే చెప్పడం కష్టమే! Moonపై ఒక రోజు length భూమిమీద సుమారు 28 రోజులు. అందులో Day Time 14 రోజులు ఉంటుంది. ఆ తర్వాత Night సమయం మొదలవుతుంది. అది చాలా cool గా, ప్రతికూలంగా ఉంటుంది. Sunlight లభించదు. ఆ వాతావరణాన్ని చంద్రయాన్‌-3 పరికరాలు తట్టుకొని నిలబడటం అనుమానమే! అందువల్ల 14 Days మాత్రమే పనిచేసేలా ల్యాండర్‌, రోవర్‌లను రూపొందించారు. అయితే 14 రోజుల రాత్రి తర్వాత మళ్లీ సూర్యోదయమయ్యాక అవి ‘inactive’ నుంచి మేల్కొని, తిరిగి పనిచేసే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు

Flash...   మొబైల్ నెట్ స్లో అయ్యిందా.. సెట్టింగ్స్‌లో ఈ మార్పులు చెయ్యండి.. రాకెట్‌లా దూసుకెళ్తుంది

చంద్రయాన్ 3 రోవర్ లాండర్ నుండి చంద్ర ఉపరితలంపైకి ఎలా దూసుకుపోయిందో వీడియో విడుదల చేసిన ఇస్రో