VEMANA AUDIO PADYALU – వేమన పద్యాలు

VEMANA AUDIO PADYALU – వేమన పద్యాలు
yogo-vemana

  1. అనువుగాని చోట అదికుల మనరాదు. కొంచెముండు టెల్ల కొదవ గాదు కొండ అద్దమందు కొంచెమై వుండదా విశ్వదాభి రామ వినుర వేమ . .

  2. అగ్నిచేతబట్టి యా పరమేశుని నిందచేసి నరులు నీరుకారె? దక్షు క్రతవులోని తల్లడమెఱుగరా? విశ్వదాభిరామ వినురవేమ. .

  3. అంతరంగమందు నపరాధములు చేసి మంచివానివలెనె మనుజుడుండు ఇతరు లెఱుగకున్న నీశ్వరుడెఱుగడా? విశ్వదాభిరామ వినురవేమ. .

  4. అంతరాత్మగనక యల్పబుధ్ధులతోడ మెలగెడు జనులెల్ల మేదినిపయి యముని నరకమునకు నరుగంగ సాక్ష్యము విశ్వదాభిరామ వినురవేమ. .

  5. అధికుడైన రా జొకల్పుని జేపట్ట వానిమాట చెల్లు వసుధలోన గణకు లొప్పియున్న గవ్వలు చెల్లవా? విశ్వదాభిరామ వినురవేమ.www.teacherinfo.in .
  6. అన్నిజాడలుడిగి ఆనందకాముడై నిన్ను నమ్మజాలు నిష్ఠతోడ నిన్ను నమ్మముక్తి నిక్కంబు నీయాన విశ్వదాభిరామ వినురవేమ. .

  7. ఇనుము విఱిగెనేని యినుమాఱు ముమ్మాఱు కాచి యతుకనేర్చు గమ్మరీడు మనసు విఱిగినేని మఱియంట నేర్చునా? విశ్వదాభిరామ వినురవేమ. .

  8. ఇనుము విఱిగెనేని యినుమాఱు ముమ్మాఱు కాచి యతుకనేర్చు గమ్మరీడు మనసు విఱిగినేని మఱియంట నేర్చునా? విశ్వదాభిరామ వినురవేమ. .

  9. ఎంత సేవచేసి యేపాటు పడినను రాచమూక నమ్మరాదురన్న పాముతోడిపొందు పదివేలకైనను విశ్వదాభిరామ వినురవేమ. .

  10. ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ? వివరమెఱిగి చూడు వ్రుత్తియందు నేర్పులేనివాని నెఱయోధుడందురా? విశ్వదాభిరామ వినురవేమ. .

  11. ఒకరి నోరుకొట్టి యొకరు భక్షించిన వాని నోరు మిత్తి వరుసగొట్టు చేపపిండు బెద్ద చేపలు చంపును చేపలన్ని జనుడు చంపు వేమ. .

  12. కల్ల నిజముజేసి కపటభావముజేంది ప్రల్లదంబులాడు భక్తిలేక మాయలాడుఖలుడు మహితాత్ముసాటియా? విశ్వదాభిరామ వినురవేమ. .

  13. గుఱ్ఱమునకు దగిన గుఱుతైన రౌతున్న గుఱ్ఱములు నడచు గుఱుతుగాను గుర్తు దుర్జనులకు గుణము లిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ. .

  14. ఎడ్డెవానికి గురుతోర్చి చెప్పినగాని తెలియబడునె యాత్మ దెలివిలేక చెడ్డ కొడుకు తండ్రి చెప్పిన వినడయా విశ్వదాభిరామ వినురవేమ. .

  15. ఎడ్డెవానికి గురుతోర్చి చెప్పినగాని తెలియబడునె యాత్మ దెలివిలేక చెడ్డ కొడుకు తండ్రి చెప్పిన వినడయా విశ్వదాభిరామ వినురవేమ. .

  16. కండ చక్కెఱయును గలియ బాల్పోసిన తఱిమి పాము తన్నుదాకుగాదె కపటమున్నవాని గంపెట్టవలె సుమీ విశ్వదాభిరామ వినురవేమ. .

  17. కలియుగంబునందు ఘనతకు నైచ్యము ఘనత నైచ్యమునకు గలుగుచుండు శ్రధ్ధ భక్తులుడిగి జనులుంద్రు కావున విశ్వదాభిరామ వినురవేమ .

  18. కల్లుకుండకెన్ని ఘనభూషణము లిడ్డ అందులోని కంపు చిందులిడదె? తులవ పదవిగొన్న దొలి గుణమేమగు? విశ్వదాభిరామ వినురవేమ.www.teacherinfo.in .

  19. కానివానితోడగలసి మెలంగిన హానివచ్చు నెంతవానికైన కాకిగూడి హంస కష్టంబు పొందదా? విశ్వదాభిరామ వినురవేమ. .

  20. కూళ కూళ్ళుమేయు గుణమంత చెడనాడి నెట్టివారు మెచ్చరట్టివాని కొయ్యదూలమునకు గుదురునా ఞానంబు? విశ్వదాభిరామ వినురవేమ.www.teacherinfo.in .

  21. కైపుమీఱువేళ గడకుజేరగరాదు అనువుదప్పి మాటలాడరాదు సమయమెఱుగనతడు సరసుండుకాడయా? విశ్వదాభిరామ వినురవేమ. .

  22. కొండగుహలనున్న గోవెలందున్న మెండుగాను బూది మెత్తియున్న దుష్టబుధ్ధులకును దుర్బుధ్ధి మానునా? విశ్వదాభిరామ వినురవేమ. .

  23. కోతిబట్టి తెచ్చి క్రొత్తపుట్టముగట్టి కొండమ్రుచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు విశ్వదాభిరామ వినురవేమ. .

  24. గంగపాఱుచుండ గదలని గతితోడ ముఱికివాగు పాఱు మ్రోతతోడ అధికుడొర్చునట్టు లధముడోర్వగలేడు విశ్వదాభిరామ వినురవేమ. .

  25. చదువులన్ని చదివి చాలవివేకియై కలుషచిత్తుడైన ఖలుని గుణము దాలిగుంటగుక్క తలచిన చందమౌ విశ్వదాభిరామ వినురవేమ. .

  26. చంపగూడ దెట్టి జంతువునైనను చంపవలయు లోకశత్రుగుణము తేలుకొండిగొట్ట దేలేమిచేయురా విశ్వదాభిరామ వినురవేమ. .

  27. ఛర్ధి పుట్టినప్డు సాపడసైపదు నాతిగన్న యప్డు నీతి తగదు చేటు మూడినపుడు మాటలు తోచవు విశ్వదాభిరామ వినురవేమ. .

  28. టక్కరులను గూడి యొక్క సక్కెములాడ నిక్కమైన ఘనుని నీతిచెడును ఉల్లితోట బెరుగు మల్లెమొక్కకరణి విశ్వదాభిరామ వినురవేమ. .

  29. డెందమందు దలచు దెప్పరమెప్పుడు నోర్వలేనిహీను డొరునికట్టె తనకు మూడుసుమ్మి తప్పదెప్పటికైన విశ్వదాభిరామ వినురవేమ. .

  30. తనకుగలుగు పెక్కు తప్పులటుండగా పరులనేరుచుండు నరుడు తెలియ డొడలెఱుంగ డనుచు నొత్తి చెప్పంగవచ్చు విశ్వదాభిరామ వినురవేమ. .

  31. తనర న్రుపతితోడ దగ దుర్జనునితోడ అగ్నితోడ బరుని యాలితోడ హాస్యమాడుటెల్ల నగును ప్రాణాంతము విశ్వదాభిరామ వినురవేమ. .

  32. తేలుకుండును తెలియగొండి విషంబు ఫణికినుండు విషము పండ్లయందు తెలివిలేని వాండ్ర దేహమెల్ల విషంబు విశ్వదాభిరామ వినురవేమ. .

  33. దాసరయ్య తప్పు దండంబుతో సరి మోసమేది తన్ను ముంచుకున్న? నీచుడై చెడునటు నీచుల నమ్మిన విశ్వదాభిరామ వినురవేమ. .

  34. దుండగీడు కొడుకు కొండీడు చెలికాడు బండరాజునకును బడుగుమంత్రి కొండముచ్చునకును కోతియె సరియగు విశ్వదాభిరామ వినురవేమ. .

  35. దుష్టజనులు మీఱి తుంటరిపనులను శిష్టకార్యములుగ జేయుచుంద్రు కూడదనెడువారి గూడ నిందింతురు విశ్వదాభిరామ వినురవేమ. .

  36. దూరద్రుష్టిగనరు తూగిదనుకను బారుపట్టెఱుగౌ పడినదనుక దండసాధ్యులరయ ధర్మసాధ్యులుకారు విశ్వదాభిరామ వినురవేమ. www.teacherinfo.in .

  37. నేరని జనులకును నేరముల్ నేర్పుచు చక్కచేయరిల నసాధులెపుడు ఒప్పు దుర్జనములు తప్పగనెంతురు విశ్వదాభిరామ వినురవేమ. .

  38. నొసలు బత్తుడయ్యె నోరు తోడేలయ్యె మనసు భూతమువలె మలయగాను శివుని గాంతు ననుచు సిగ్గేలగాదురా? విశ్వదాభిరామ వినురవేమ. .

  39. పరులు చదువజూచి నిరసనబుధ్ధితో వట్టిమాటలాడు వదరుబోతు అట్టి ఖలుని జాడలరయుట దోసము విశ్వదాభిరామ వినురవేమ. .

  40. పాలు పంచదార పాపరపండ్లలో చాలబోసి వండ జవికిరావు కుటిలమానవులకు గుణమేల కల్గురా? విశ్వదాభిరామ వినురవేమ. .

  41. బిడియ మింతలేక పెద్దను నేనంచు బొంకములను బల్కు సంకఠునకు ఎచ్చు కలుగదిచట జచ్చిన రాదట విశ్వదాభిరామ వినురవేమ. .

  42. మాటలాడు టొకటి మనసులో నొక్కటి ఒడలిగుణ మదొకటి నడత యొకటి ఎట్లుకలుగు ముక్తి యిట్టులుండగ తాను విశ్వదాభిరామ వినురవేమ. .

  43. ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు పరగ మూలికలకు బనికివచ్చు నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు? విశ్వదాభిరామ వినురవేమ. .

  44. రేగుపుచ్చకాయ రేయెల్ల దన్నిన మురగ దంతకంత పెరుగుగాని ఒరులు ఛీయన్నను నోగు సిగ్గెఱుగునా? విశ్వదాభిరామ వినురవేమ. .

  45. వంపుకఱ్ఱగాచి వంపు తీర్చగవచ్చు కొండలన్ని పిండిగొట్టవచ్చు కఠినచిత్తు మనసు కరగింపరాదు విశ్వదాభిరామ వినురవేమ. .

  46. వాక్కు శుధ్ధిలేని వైనదండాలు ప్రేమ కలిగినట్టు పెట్టనేల? నొసట బత్తిజూపు నోరు తోడేలయా విశ్వదాభిరామ వినురవేమ. www.teacherinfo.in.