ప్రధానోపాధ్యాయుడికి 20 ఏళ్ల కారాగార శిక్ష

ప్రధానోపాధ్యాయుడికి 20 ఏళ్ల కారాగార శిక్ష

కటక్, న్యూస్టుడే: బోలంగీర్ జిల్లా దేవగాం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్సింగ్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా పని చేస్తూ సస్పెన్షన్‌కు గురైన విశ్వనాథ్ బుద్ధియాకు బొలంగీర్ జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

పాఠశాలలో విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఆరోపణలపై ఆయనపై నమోదైన కేసును విచారించిన అనంతరం శనివారం తీర్పు వెలువరించారు. 2022లో పాఠశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థినులను మానసికంగా, లైంగికంగా వేధించాడు. విషయం తెలుసుకున్న చాలా మంది వారి తల్లిదండ్రులతో కలిసి 24 ఆగస్టు 2022న పాఠశాల ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఫలితంగా జిల్లా విద్యాశాఖ అధికారి అతనిని సస్పెండ్ చేశారు. విశ్వనాథ్ బుద్ధియాపై బాధిత బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ జరిపి అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోక్సో కోర్టు విచారణ చేపట్టి తీర్పును ప్రకటించింది.

Flash...   ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీనిచ్చే బ్యాంకులు ఇవే.. ఏకంగా 9.5శాతం వడ్డీ.. వివరాలు ఇవి..