IDBI అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు 2023 తెలుగులో : IDBI బ్యాంక్ 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.
IDBI Assistant Manager Jobs 2023 :
Banking sector
ఐడిబిఐ బ్యాంక్‌లో మంచి ఉద్యోగం పొందాలని ఆశిస్తున్న అభ్యర్థులందరికీ శుభవార్త 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Details of Junior Assistant Manager (Grade – O) posts
- UR – 243 posts
- OBC – 162 posts
- SC – 90 posts
- ST – 45 posts
- EWS – 60 posts
- Total – 600 posts
Educational Qualifications
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి కనీసం 55% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అలాగే స్థానిక భాష తెలిసి ఉండాలి.
Age limit
అభ్యర్థుల వయస్సు 31 ఆగస్టు 2023 నాటికి 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల అభ్యర్థులకు వయో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
IDBI Junior Assistant Manager Fee :
జనరల్ మరియు OBC అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.1000 చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు దరఖాస్తు రుసుముగా రూ.200 మాత్రమే చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైన వారికి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం అర్హులైన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
Application Procedure
అభ్యర్థులు IDBI అధికారిక వెబ్‌సైట్ https://www.idbibank.in/ లో దరఖాస్తు చేసుకోవాలి.
APలో పరీక్షా కేంద్రాలు: శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, చీరాల, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు
తెలంగాణలో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
Salaries
IDBI జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జీతం: ఎంపికైన అభ్యర్థులకు 6 నెలల పాటు శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ సమయంలో వారికి నెలకు రూ.5000 ఇస్తారు. నెలకు రూ.15,000 చొప్పున ఇంటర్న్‌షిప్ (2 నెలలు) అందించబడుతుంది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన వారికి వార్షిక వేతనం రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల వరకు అందజేస్తారు.
Important dates
- IDBI Junior Assistant Manager Last Date To Apply
- Online Applications Start : 2023 September 15
- Last date for online application : 30 September 2023
- Online Exam Date : 2023 October 20