అక్టోబర్ 1 నుంచి బర్త్‌ సర్టిఫికెట్‌తో ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌

అక్టోబర్ 1 నుంచి  బర్త్‌ సర్టిఫికెట్‌తో ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జనన, మరణాల నమోదు (సవరణ) చట్టం-2023 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.ఈ మేరకు బుధవారం నాడు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ఓటరు నమోదు, వివాహ నమోదు, ప్రభుత్వ ఉద్యోగ నియామకం తదితరాలకు జనన ధృవీకరణ పత్రం సరిపోతుంది. పాస్‌పోర్ట్ మరియు ఇతర అవసరాలకు జనన ధృవీకరణ పత్రం మాత్రమే. ఈ చట్టం ప్రారంభమైన తేదీ లేదా ఆ తర్వాత జన్మించిన వ్యక్తులందరికీ, జనన ధృవీకరణ పత్రం అన్ని ప్రయోజనాల కోసం ఒకే పత్రంగా పనిచేస్తుంది.

Flash...   ఉద్యోగుల ఆందోళనపై.. సీఎం కీలక భేటీ? | CM Jagan Key Meeting on AP Employees Strike