మరో అల్పపీడనం – ఏపీ, తెలంగాణలకు భారీ వర్ష సూచన

మరో అల్పపీడనం – ఏపీ, తెలంగాణలకు భారీ వర్ష సూచన

తాజాగా బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. క్రమంగా అల్పపీడనానికి అనుకూల వాతావరణం ఉంది. తదనంతరం, ఒడిశా, ఉత్తర ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ మరియు ఉత్తర తెలంగాణల్లో ఇది వ్యాపించవచ్చని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈ నెల 17వ తేదీ వరకు ఈ నాలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.

బంగాళాఖాతంలోని మధ్య, ఉత్తర ప్రాంతాలపై ఏడున్నర కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఈ వాయుగుండం రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారనుందని వెదర్ ఛానల్ కూడా ధృవీకరించింది. అల్పపీడనంగా మారిన తర్వాత క్రమంగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా విస్తరిస్తుంది.

రానున్న మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం నుంచి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో, 16-17 తేదీల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ ఛానల్ వివరించింది. అరేబియా సముద్రంలో తేమగా ఉండే పశ్చిమ గాలుల ప్రభావంతో ముంబై సహా కొంకణ్ తీరంలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఏపీలో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ ఛానల్ అంచనా వేసింది. చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందిశాస్త్రవేత్తలు చెపుతున్నారు.

Flash...   ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తులో సినిమా థియేట‌ర్.. ఇండియాలో