అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులు బంద్

అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులు బంద్

ఖాతాదారులకు ఎల్లప్పుడూ బ్యాంకులతో ఏదో ఒక సంబంధం ఉంటుంది. పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ చేయడం లేదా విత్‌డ్రా చేయడం, ఏదైనా రుణం తీసుకోవడం, చెక్కు డిపాజిట్ చేయడం వంటి వాటి కోసం ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది.

అలాంటి సమయాల్లో బ్యాంకులకు ఏయే రోజులు సెలవులు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడం మంచిది. దీనివల్ల సమయం ఆదా చేయడంతోపాటు నగదు లావాదేవీలను ముందుగానే నిర్వహించుకోవచ్చు. ప్రాంతాల వారీగా బ్యాంకు సెలవులు మారుతూ ఉంటాయి. ప్రాంతీయ పండుగలను బట్టి బ్యాంకు సెలవులు రాష్ట్రాల నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.

వచ్చే నెలలో వరుస పండుగలు రానున్నాయి. ప్రభుత్వ సెలవులు కూడా వస్తున్నాయి. అక్టోబర్‌లో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. శని, ఆదివారాలతో పాటు గాంధీ జయంతి, దసరా, దుర్గాష్టమి సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఏయే రోజుల్లో బ్యాంకులు మూతపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అక్టోబర్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అక్టోబర్ 2 గాంధీ జయంతి, అక్టోబర్ 22 దుర్గాష్టమి మరియు అక్టోబర్ 24 దసరా రోజున బ్యాంకులు మూసివేయబడతాయి.

Flash...   చంద్రుడిపై ఎకరం భూమి కొన్న వ్యాపారి.. రేటు తక్కువే మరి!