ఈరోజు నుంచి ఆ కరెన్సీ నోట్లు చెల్లవు.. కంపెనీ కీలక ప్రకటన!

ఈరోజు నుంచి ఆ కరెన్సీ నోట్లు చెల్లవు.. కంపెనీ కీలక ప్రకటన!

కరెన్సీ నోట్లు ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న అమెజాన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. రూ. 2 వేల నోట్లు (2000) ఇకపై ఆమోదించబడవు.

క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌తో రూ. 2 వేల నోట్లు ఇస్తున్న ఈ విషయం గమనించాలి. అమెజాన్ ఇకపై రూ.2000 నోట్లను అంగీకరించదు. మే 19న రూ.2000 నోట్లను ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అమెజాన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఆర్బీఐ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30 వరకు రూ. 2 వేల నోట్లు చెల్లుతాయి. తర్వాత అవి చెలామణిలో లేవు.

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రూ. 2 వేల నోట్లను ఈ నెలాఖరు వరకు మార్చుకోవచ్చు. అయితే అమెజాన్ ఇండియా నేటి నుంచి రూ. 2 వేల నోట్లను నిలిపివేశారు. అయితే, థర్డ్ పార్టీ కొరియర్ సేవలు ఇప్పటికీ రూ.2,000 నోట్లను తీసుకోవచ్చని అమెజాన్ ఇండియా పేర్కొంది. ఇప్పటికే చాలా వరకు రూ.2 వేల నోట్లు బ్యాంకుల్లోకి తిరిగొచ్చాయని చెప్పొచ్చు.

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తాజాగా కీలక ప్రకటన చేశారు. రూ.2.72 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయన్నారు. జూన్ 30 నాటికి ఆ నోట్లు తిరిగి వచ్చి బ్యాంకుల్లో జమ అయ్యాయి. అమెజాన్ ఇండియా నిర్ణయంతో రూ.2000 నోట్ల గడువు దగ్గర పడిన సంగతి అందరికీ మరోసారి గుర్తుకు వచ్చిందని చెప్పొచ్చు. అమెజాన్ రూ.2000 నోట్లను అంగీకరించకపోయినా.. థర్డ్ పార్టీ కొరియర్ పార్టనర్స్ ద్వారా డెలివరీ చేసే ఉత్పత్తులకు రూ.2000 నోట్లు చెల్లుబాటు అవుతాయని తెలిపింది.

అందువల్ల ఇంకా ఎవరి వద్ద రూ.2 వేల నోట్లు ఉంటే వెంటనే బ్యాంకుకు వెళ్లి మార్చుకోవచ్చు. లేదా బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవచ్చు. లేదంటే ఈ నెల తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రూ.2 వేల నోట్లు చెల్లవని గమనించండి. కాగా, రూ.2 వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన 20 రోజుల్లోనే దాదాపు 50 శాతం రూ.2 వేల నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.

Flash...   STUDENT ATTENDANCE CAPTURED PROCESS IN CSE