Common Admission Test: అభ్యర్థులకు అలర్ట్.. CAT రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..

Common Admission Test: అభ్యర్థులకు అలర్ట్.. CAT రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..

జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షలలో, కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) ఒకటి. దీని ద్వారా దేశంలోని ఐఐఎంలు, బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ వంటి మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇటీవల, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-లక్నో (IIM-లక్నో) CAT-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అధికారిక పోర్టల్ iimcat.ac.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 2 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా, సెప్టెంబర్ 13 చివరి తేదీగా పేర్కొన్నారు. తాజాగా ఈ గడువును పొడిగించారు. గడువును మరో వారం పొడిగిస్తూ.. సెప్టెంబర్ 20 చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది.

Eligibility  for CAT Exam 

CAT-2023 కోసం దరఖాస్తు చేయడానికి కనీసం 50% మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ విద్యార్థులు కనీసం 45 శాతం స్కోర్ చేసి ఉండాలి. చివరి సంవత్సరం గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

 Registration Process

  • – ముందుగా iimcat.ac.in అధికారిక పోర్టల్‌ని తెరవండి. హోమ్ పేజీకి వెళ్లి రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • – ఇది కొత్త పేజీని తెరుస్తుంది. ఇక్కడ అడిగిన వ్యక్తిగత వివరాలను నమోదు చేసి నమోదు చేసుకోండి.
  • – ఆపై రిజిస్టర్ ఐడితో లాగిన్ చేసి, CAT-2023 దరఖాస్తు ఫారమ్‌ను తెరవండి. అన్ని వివరాలను నమోదు చేయండి.
  • – దరఖాస్తు రుసుము చెల్లించి, ఫారమ్‌ను సమర్పించండి. భవిష్యత్ ఉపయోగం కోసం కాపీని సేవ్ చేసి ప్రింట్ తీసుకోవడం మంచిది.

దరఖాస్తు రుసుము

జనరల్ మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.2,400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.1,200 చెల్లించాలి.

  • నవంబర్‌లో పరీక్ష EXAM IN NOVEMBER 

CAT-2023 ప్రవేశ పరీక్ష నవంబర్ 26న మూడు సెషన్లలో జరుగుతుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 155 నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ప్రాధాన్యత ప్రకారం ఆరు పరీక్ష నగరాలను ఎంచుకోవచ్చు. CAT-2023 కోసం అడ్మిట్ కార్డ్‌లు అక్టోబర్ 25 నుండి అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి.

Flash...   Paytm కొత్త సర్వీసులు.. వడ్డీ లేకుండా తక్కువ రుణం..!

CAT EXAM పరీక్ష నమూనా

క్యాట్ ప్రవేశ పరీక్ష మూడు గంటల పాటు ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడుతుంది. ప్రశ్నపత్రంలో MCQలు, కొన్ని కీ-ఇన్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ప్రశ్నలకు సమయానికి అనుగుణంగా సమాధానాలు రాయాలి. అంటే వారికి నచ్చిన సెక్షన్‌కి సమాధానం చెప్పే అవకాశం ఉండదు. ఒకసారి దాటవేయబడిన ప్రశ్నకు తిరిగి వెళ్లలేరు.

CAT-2023 పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (QA), డేటా ఇంటర్‌ప్రెటేషన్ & లాజికల్ రీజనింగ్ (DILR), వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ (VARC) వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

మార్కింగ్ పద్ధతి

CAT పరీక్షలో అడిగే ప్రశ్నల సంఖ్య ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. 2019 వరకు 100-ప్రశ్నలు అడిగారు. 2020లో ప్రశ్నల సంఖ్య 76కి తగ్గింది. 2021లో 66 ప్రశ్నలు మాత్రమే అడిగారు. నెగెటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.

చెల్లుబాటు

దేశంలోని మొత్తం 20 ఐఐఎంలు మరియు 1100 కంటే ఎక్కువ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు క్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు క్యాట్ స్కోర్ ఒక సంవత్సరం మాత్రమే చెల్లుతుంది