నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. DRDO లో 204 పోస్టులు భర్తీ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. DRDO లో 204 పోస్టులు భర్తీ

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పలు సంస్థల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వింగ్ డిఆర్‌డిఓ నిరుద్యోగులకు శుభవార్త అందించింది.

ఈ సంస్థ సైంటిస్ట్-బి కేటగిరీ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ చేస్తోంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 204 ఖాళీలు విడుదలయ్యాయి. అర్హత గల అభ్యర్థులు అధికారిక పోర్టల్ www.drdo.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ గడువు సెప్టెంబర్ 29 వరకు ఉంటుంది.

ఖాళీగా ఉన్న పోస్టులు 204. శాఖల వారీగా ఇలా..

  • DRDO Main:  181
  • Section:  11 of DST
  • ADA : 06
  • CME Section:  06

Qualifications..

దరఖాస్తుదారులు సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (గేట్) తప్పనిసరిగా అర్హత సాధించాలి. ఈ సమాచారం తప్పనిసరిగా దరఖాస్తు ఫారమ్‌లో అందించాలి.

Age:

అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు.

Interview process

పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ మరియు వేదిక వివరాలు ప్రత్యేక కాల్ లెటర్ ద్వారా అభ్యర్థులకు తెలియజేయబడతాయి.

Salary:

DRDO సైంటిస్ట్-బి రిక్రూట్‌మెంట్ కోసం ఎంపికైన అభ్యర్థుల జీతం నెలకు రూ.56,100 నుండి రూ.1,77,500 వరకు ఉంటుంది…

How to apply?

  • ముందుగా DRDO అధికారిక పోర్టల్ www.drdo.gov.in ని తెరవండి. హోమ్ పేజీకి వెళ్లి, అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ 145పై క్లిక్ చేసి, సైంటిస్ట్-బి నోటిఫికేషన్ వివరాలను తనిఖీ చేయండి.
  • ఆ తర్వాత అప్లై నౌ ఆప్షన్‌పై క్లిక్ చేసి అప్లై చేయండి. ముందుగా పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేసి నమోదు చేసుకోండి.
  • ఆ తర్వాత రిజిస్టర్ ఐడీ మరియు పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ చేసి దరఖాస్తు ఫారమ్‌ను తెరవండి.
  • అందులో అన్ని వివరాలను నమోదు చేయండి. దరఖాస్తు రుసుము చెల్లించాలి..
  • అవసరమైన పత్రాలు దరఖాస్తు చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి..
  • నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోవడం మంచిది.
Flash...   కేవలం పదవ తరగతి తో .. పోలీస్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ .. వివరాలు ఇవిగో..