చంద్రబాబు నాయుడు అరెస్ట్ – విజయవాడకు తరలింపు.

చంద్రబాబు నాయుడు అరెస్ట్ – విజయవాడకు తరలింపు.

రాష్ట్ర రాజకీయాల్లో కలకలం. టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నంద్యాలలో చంద్రబాబు బస చేసిన క్యాంపు వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఆ సమయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. తనను అరెస్ట్ చేయడానికి గల కారణాలను చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసిన కాగితాలు, వివరాలు ఇచ్చి చంద్రబాబును అరెస్ట్ చేశారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను విజయవాడకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. నంద్యాలలో బస చేసిన చంద్రబాబు బస్సు వద్దకు భారీ సంఖ్యలో పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకుంటున్నారని తెలిపారు.

ఆ సమయంలో చంద్రబాబు తన హక్కులను ఎందుకు కాలరాస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. ఏ చట్టం ప్రకారం అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా తనను ఎలా నిర్బంధించారని మండిపడ్డారు. ప్రాథమిక ఆధారాలను హైకోర్టుకు అందజేశామని పోలీసులు తెలిపారు.

చంద్రబాబు తరపున లాయర్లు పోలీసులతో వాదించారు. ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. రిమాండ్ రిపోర్టులో అన్నీ వివరించబడ్డాయి. శనివారం తెల్లవారుజామున చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. అనంతపురం నుంచి అదనపు బలగాలను రప్పించి అక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ లో జరిగిన కుంభకోణంపై సీఐడీ, ఈడీ విచారణ జరిపాయి. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై వైసీపీ నేతలు చాలా రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు.

ఈ విషయంలో ఇప్పటికే అటాచ్‌మెంట్‌లు జరిగాయి. షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల అనంతరం విజయవాడకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

రెండు రోజుల క్రితమే తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఇప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బాబు అరెస్ట్‌తో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది.

Flash...   ఇద్దరు SGT ఉపాధ్యాయులను ప్రభుత్వానికి సరెండర్ చేసిన కలెక్టర్