ఫార్మేటివ్ అసెస్మెంట్ ( FA) -2 పరీక్షలు October 3 నుంచి 6వ వరకు నిర్వహించాలని School Education ఆదేశాలు జారీచేసింది.
అన్ని యాజ మాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశా లల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన syllabus ప్రకారం common Exam paper ఉంటుందని, పరీక్షలు OMR కా కుండా పాతపద్ధతిలోనే ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.
ఆయా ప్రశ్నపత్రాలను పరీక్ష జరిగే రోజు Whatsapp ద్వారా MEO లు, ప్రధానోపాధ్యాయుల గ్రూపులకు పంపిస్తామని, పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల HM లకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు.
AP FA2 Exam Process & Scheme
6వ, 7వ, 8వ, 9వ మరియు 10వ తరగతులకు తేదీ అక్టోబర్ 3 నుంచి 6 వరకు అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో విరివిగా నిర్వహించవలెను
1. ఎఫ్ ఎ -2 పరీక్షలు 03.10 2023 వ తేదీ నుండి పైన తెలువబడిన షెడ్యూల్ ప్రకారం, ఇవ్వబడిన సిలబస్ నందు అన్ని యాజమాన్య పాఠశాలలకు ఉమ్మడి ప్రశ్న పత్రము ద్వారా నిర్వహింప బడతాయి.
2. ఈ పరీక్షలకు OMRలు ఉండవు. పాత పద్ధతిలో ఉంటాయి.
3. ప్రశ్నా పత్రాలు వాట్సాప్ ద్వారా పరీక్షలు జరిగే రోజులలో రోజువారీగా మండల విద్యాశాఖాధికారులకు/ ప్రధానోపాధ్యాయులకు వారి వారి గ్రూపులలో పంపడం జరుగుతుంది.
4. ఆ ప్రశ్నా పత్రాలను మండల విద్యాశాఖాధికారులు మండల వాట్సాప్ group ద్వారా 1 గంట ముందు అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపడం జరుగుతుంది.
5. ప్రశ్నా పత్రాన్ని బ్లాక్ బోర్డు పై వ్రాసి విద్యార్థులను వ్రాసుకోమని పరీక్ష నిర్వహించాలి. 6. రోజుకు రెండు పరీక్షలు నిర్వహించాలి.