SSC CHSLలో పెరిగిన పోస్టులు.. ఎన్నంటే

SSC CHSLలో పెరిగిన పోస్టులు.. ఎన్నంటే

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి SSC (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (CHSL) 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

కానీ గత నోటిఫికేషన్‌లో 1600 ఖాళీలు ఉన్నాయని పేర్కొనగా తాజాగా వాటిని పెంచారు. ప్రస్తుతం మొత్తం ఖాళీలు 1762గా పేర్కొనబడ్డాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల్లో జూనియర్ సెక్రటేరియట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టులను భర్తీ చేస్తారు. మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టులో టైర్ 1 పరీక్షలు నిర్వహించారు. త్వరలో టైర్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు.

Flash...   HAPPY NEW YEAR 2023 STICKKERS PHOTO FRAMES LIVE WALL PAPERS APPS FOR ANDROID