ITI అర్హతతో హైదరాబాద్ లోని(NFC) ఎన్ఎఫ్సీలో అప్రెంటీస్ ఉద్యోగాలు…

ITI అర్హతతో హైదరాబాద్ లోని(NFC) ఎన్ఎఫ్సీలో అప్రెంటీస్ ఉద్యోగాలు…

Nuclear Fuel Complex Apprentice Jobs:

హైదరాబాద్ లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) 206 అప్రెంటీస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

NFC Apprentice Jobs :
ఐటీఐ చేసి ప్రభుత్వ రంగ

ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. భారత అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్ లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కంప్లెక్స్ (NFC) 206 అప్రెంటీస్ ఖాళీల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు విభాగాలు/ ట్రేడ్ ఏడాదిపాటు అప్రెంటీస్ శిక్షణ ఇస్తుంది.

మొత్తం ఖాళీలు : 206 పోస్టులు

ఖాళీల వివరాలు:

▪ఫిట్టర్ – 42
▪టర్నర్ – 32
▪లేబరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్) – 6
▪ఎలక్ట్రిషియన్ – 15
▪మెషినిస్ట్ – 16
▪మెషినిస్ట్ (గ్రైండర్) – 8
▪అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్) – 15
▪కమికల్ ప్లాంట్ ఆపరేటర్ – 14
▪ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ – 7
▪స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్) – 2
▪కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ – 16
▪వెల్డర్ – 16
▪మెకానిక్ (డీజల్) – 4
▪కార్పెంటర్ – 6
▪ప్లంబర్ – 4

అర్హతలు : అభ్యర్థులు 10వ సాధించి ఉండాలి. తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయస్సు : అభ్యర్థుల వయస్సు అప్లికేషన్ చివరి తేదీ నాటికి 18 ఏళ్ల కంటే తక్కువ ఉండరాదు.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు  అప్రెంటీస్ పోస్టులకు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: అభ్యర్థులను 10వ తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అయితే ఎలక్ట్రిషియన్, వెల్డర్ ట్రేడ్లకు మాత్రం ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇలా ఎంపికైన అభ్యర్థులకు ఈ -మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. వీరు అప్రెంటీస్ ట్రైనింగ్లో చేరేటప్పుడు కచ్చితంగా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ను సమర్పించాల్సి ఉంటుంది.

Flash...   Ola Electric Scooter: Ola ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు షురూ.. ఏకంగా రూ. 20,000 డిస్కౌంట్.. త్వరపడండి..

ట్రైనింగ్ పీరియడ్: ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్లోని ఎన్ఎఫ్సీలో ఒక ఏడాది పాటు అప్రెంటీస్ శిక్షణ అందిస్తారు.

స్టైపెండ్ : అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7,700 నుంచి రూ.8,050 చొప్పున స్టైపెండ్ అందిస్తారు.

దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2023