AP ఇంటర్‌ అర్హతతోనే సాప్ట్‌వేర్‌ ఉద్యోగం.. HCL తో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం

AP ఇంటర్‌ అర్హతతోనే సాప్ట్‌వేర్‌ ఉద్యోగం.. HCL తో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం

అమరావతి: ప్రస్తుతం యువత ఎక్కువగా సాప్ట్‌వేర్ ఉద్యోగాలే లక్ష్యంగా విద్యాభ్యాసం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు బీటెక్‌లో ఐటీ లేదా సీఎస్‌ఈ గ్రూపు వారికే సాప్ట్‌వేర్ ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండేవి.

అయితే ఇటీవల కాలంలో ఇతర గ్రూపులకు చెందినవారు కూడా సాప్ట్‌వేర్‌కు సంబంధించిన కోర్సులు పూర్తి చేసి ఉద్యోగావకాశాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు కేవలం ఇంటర్మీడియట్ అర్హతతోనే సాప్ట్‌వేర్ ఉద్యోగం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పించేందుకు రూపొందించింది.

భారతదేశపు అతిపెద్ద ఐటీ కంపెనీ HCLతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మంచి ఉద్యోగావకాశాలను అందిస్తోంది ప్రభుత్వం. ఈ అసాధారణ కార్యక్రమంపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది.

ఇందులో భాగంగా తొలిసారిగా ప్రయోగాత్మకంగా అనకాపల్లి ఏఎంఏఎల్‌ కళాశాలలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లకు HCL సంస్థ ప్రతినిధులు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఇలాంటి మంచి అవకాశంపై విద్యార్థులకు కళాశాలల ప్రిన్సిపాళ్లు వివరించి అవగాహన కల్పించాలన్నారు. చిన్న వయసులోనే సాప్ట్‌వేర్‌ కొలువులతోపాటు ఉన్నత విద్యను చదువుకునే వీలుంటుందన్నారు.

దీనిని విద్యార్థులంతా సద్వినియోగ పర్చుకునేలా చూడాలని ప్రిన్సిపాళ్లను నిర్ణయించారు. HCL Tech B ప్రోగ్రాం గురించి సంస్థ రాష్ట్ర ప్రతినిధులు పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా సమగ్రంగా వివరించారు. 2023, 2024 సవత్సరాల్లో ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు HCL ఎర్లీ కెరీర్‌ ప్రోగ్రాంకు అర్హులు. అర్హులైన అభ్యర్థులు ముందుగా ఎంపిక చేసుకుంటే ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ముందుగా నిర్వహించే ఆన్‌లైన్‌లో పరీక్షలో ఎంపికైన వారికి హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ ఉంటుంది.

ఎంపికైన విద్యార్థులు HCL Tech B ప్రోగ్రాంలో చేరడానికి ఆఫర్‌ లెటర్‌ పొందుతారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆ తర్వాత ఏడాది కాలపరిమితితో Tech B శిక్షణ ఉంటుంది. విజయవాడ, హైదరాబాద్‌, బెంగుళూరుల్లో HCL క్యాంపస్‌లకు వెళ్లి ఒక నెల శిక్షణ తీసుకోవాలి. అనంతరం ఐదు నెలలు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో శిక్షణ పొందవచ్చు. అభ్యర్థులకు ల్యాప్ ట్యాప్‌తో పాటు ఇంటర్‌నెట్‌ ఛార్జీలు సంస్థ ఇస్తుంది.

Flash...   దేశంలో విద్య వ్యాపారమైపోయింది - D.Ed కాలేజీల యాజమాన్యాలపై హైకోర్టు మండిపాటు

అనంతరం ప్రారంభంలోనే రూ.10 వేల స్టేఫండు ఆరు నెలలు చెల్లిస్తారు. తర్వాత ప్రతిభా ఆధారంగా సాప్ట్‌వేర్‌తో పాటు ఇతర రంగాల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని వారు తెలిపారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాల కోసం తమ సంస్థ దేశంలో ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఐఐటీ, ఐఐఎంలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదిలా వుండగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా హైస్కూల్‌ విద్య నుంచే ఐటీ కోర్సులకు సంబంధించిన శిక్షణనివ్వాలని నిర్ణయించింది.