ఐక్యరాజ్యసమితి (యునైటెడ్ నేషన్స్) భారతదేశం అన్ని లాంఛనాలను పూర్తి చేస్తే, తన రికార్డులలో ‘ఇండియా’ పేరును ‘భారత్’ (ఇండియా Vs భారత్) గా మార్చడానికి అంగీకరిస్తుందని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ చీఫ్ రిప్రజెంటేటివ్ స్టీఫెన్ డుజారిక్ భారత్ అధ్యక్షతన జరుగుతున్న జి20 సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పేరు మార్పుకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీలను భారత్ పూర్తి చేసి తమకు తెలియజేస్తే ఐక్యరాజ్యసమితి రికార్డుల్లో ఆ మేరకు మార్పులు చేస్తామన్నారు.
ఇదిలా ఉండగా, G20 అతిథులను విందుకు ఆహ్వానిస్తున్న పత్రాల్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముని ‘ప్రెసిడెంట్ ఆఫ్ INDIA’ అని కాకుండా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొన్నారు. అలాగే మోదీని ‘భారత ప్రధాని’గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘INDIA’ పేరును ‘భారత్’గా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. అయితే దీనిపై విపక్షాలతోపాటు పలు రంగాల నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు