రూ. 2 కోట్ల నుంచి రూ. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ రూ.25 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించినట్లు ప్రకటించింది. అలాగే, సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది.
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ రూ. 2 కోట్ల నుంచి రూ. 25 కోట్ల బల్క్ ఫిక్‌్వడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన కొత్త వడ్డీ రేట్లు సెప్టెంబర్ 8, 2023 నుండి అంటే నిన్నటి నుండి అమలులోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం, బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.25 శాతం నుండి 7.60 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. బ్యాంక్ ఇప్పుడు 366 రోజుల నుండి 399 రోజుల కాలవ్యవధితో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్టంగా 7.60 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లు 50 బేసిస్ పాయింట్ల (0.50 శాతం) అదనపు వడ్డీ రేటును పొందుతారు.
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై IDFC ఫస్ట్ బ్యాంక్ అందించే వడ్డీ రేట్ల వివరాలు:
- 7 రోజుల నుండి 14 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.25% వడ్డీ రేటును అందిస్తుంది.
- 15 రోజుల నుండి 35 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.30% వడ్డీ రేటును అందిస్తుంది.
- 36 రోజుల నుండి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.55% వడ్డీ రేటును అందిస్తుంది.
- 46 రోజుల నుండి 60 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.05% వడ్డీ రేటును అందిస్తుంది.
- 61 రోజుల నుండి 91 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.70% వడ్డీ రేటును అందిస్తుంది.
- 92 రోజుల నుండి 180 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.25% వడ్డీ రేటును అందిస్తోంది.
- 181 రోజుల నుండి 270 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.40% వడ్డీ రేటును అందిస్తోంది.
- 271 రోజుల నుంచి 365 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.45% వడ్డీ రేటును అందిస్తోంది.
- 366 రోజుల నుండి 399 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.60% వడ్డీ రేటును అందిస్తుంది.
- 400 రోజుల నుండి 731 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.50% వడ్డీ రేటును అందిస్తోంది.
- 732 రోజుల నుండి 1095 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.25% వడ్డీ రేటును అందిస్తోంది.
- 3 సంవత్సరాల ఒక రోజు నుండి 10 సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.10% వడ్డీ రేటును అందిస్తుంది