BEL సంస్థలో 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ఆఫీసర్ జాబ్స్‌.. బీఈ, బీటెక్ అర్హత

BEL సంస్థలో 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ఆఫీసర్ జాబ్స్‌.. బీఈ, బీటెక్ అర్హత

BEL రిక్రూట్‌మెంట్ 2023 :

భారతీయ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) 232 ప్రొబేషనరీ ఇంజనీర్, ప్రొబేషనరీ ఆఫీసర్, ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

BEL ప్రొబేషనరీ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 2023 : భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ () ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా యూనిట్లు/ఆఫీసుల్లో 232 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో ప్రొబేషనరీ ఇంజనీర్, ప్రొబేషనరీ ఆఫీసర్, ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల కోసం అభ్యర్థులు బెంగళూరు, ఘజియాబాద్, పూణే, హైదరాబాద్, చెన్నై, మచిలీపట్నం, పంచకుల, కోట్‌ద్వారా, నవీ ముంబైలలో పని చేయాల్సి ఉంటుంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు : 232

పోస్టుల కేటాయింపు: జనరల్-96, OBC-62, SC-34, ST-17, EWS-23.

  1. ప్రొబేషనరీ ఇంజనీర్: 205 పోస్టులు

అర్హత: బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్).

వయోపరిమితి: 01.09.2023 నాటికి 25 ఏళ్లు మించకూడదు.

  1. ప్రొబేషనరీ ఆఫీసర్ (HR): 12 పోస్టులు

అర్హత: MBA/ MSW/ PG/ PG డిప్లొమా (హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్(HRM)/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/ పర్సనల్ మేనేజ్‌మెంట్).

వయోపరిమితి: 01.09.2023 నాటికి 25 ఏళ్లు మించకూడదు.

3 ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్: 15 పోస్టులు

అర్హత: సీఏ/ సీఎంఏ ఫైనల్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.09.2023 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది

దరఖాస్తు రుసుము: రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

జీతం: నెలకు రూ.40,000- రూ.1,40,000, ఇతర అలవెన్సులు కలుపుకుని.

Flash...   AP PRC: ఏపీలో ఇంకా కొలిక్కిరాని ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు...CMO చుట్టూ తిరుగుతున్న జేఏసీ!

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబర్ 04, 2023.

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 28, 2023.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: డిసెంబర్, 2023

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://bel-india.in/