‘పది’ అర్హతతో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో 667 ఉద్యోగాలు..ఇలా దరఖాస్తుచేసుకోండి

‘పది’ అర్హతతో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో 667 ఉద్యోగాలు..ఇలా  దరఖాస్తుచేసుకోండి

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau)లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.

మొత్తం 677 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

మొత్తం పోస్టుల్లో 362 సెక్యూరిటీ అసిస్టెంట్- మోటార్ ట్రాన్స్‌పోర్ట్ (డ్రైవర్) పోస్టులు.. 3

15 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) పోస్టులు ఉన్నాయి.

10వ తరగతి లేదా తత్సమాన కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు అర్హులుగా పరిగణిస్తారు.

ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 13 రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు

ప్రకటనలోని  ముఖ్యాంశాలు..

అభ్యర్థుల వయోపరిమితి: సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు. MTS పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు.

Salary:

రూ.21,700- సెక్యూరిటీ అసిస్టెంట్- మోటార్ ట్రాన్స్‌పోర్ట్ పోస్టులకు రూ.69,100; మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రూ.18 వేల నుంచి రూ.56,900

  • అక్టోబర్ 14 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు.
  • దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: నవంబర్ 13

Exam Fee: 

జనరల్/OBC/EWS అభ్యర్థులకు రూ.500 (పరీక్ష రుసుము ₹50, రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఛార్జీ రూ.450). SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు రూ.450 (పరీక్ష రుసుము మినహాయింపు)

Selection Process:

రాత పరీక్ష (ఆబ్జెక్టివ్), (డిస్క్రిప్టివ్ మెథడ్), డ్రైవింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో Exam Centers:

AP లోని అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, వరంగల్ అర్బన్.

Flash...   District wise Children data whose shoe sizes to be updated