AP Govt. Jobs 2023 : వీరికి ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో..

AP Govt. Jobs 2023 : వీరికి ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో..

AP Government Jobs 2023 : వీరికి ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. Grama , ward సచివాలయాల్లో..

ఆంధ్రప్రదేశ్‌లోCovid-19 తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలపై రాష్ట్ర ప్రభుత్వం కరుణ చూపుతోంది. కోవిడ్ కారణంగా 2,917 మంది ప్రభుత్వ ఉద్యోగులు మరణించగా, వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకాలు జరిగిన విషయం తెలిసిందే.

గతంలో కారుణ్య ( Compassionate Appointments) రిక్రూట్‌మెంట్‌కు 2,744 మంది దరఖాస్తు చేసుకోగా, 1,488 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇటీవల గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరణించిన ఉద్యోగికి మైనర్ పిల్లలు ఉంటే వయస్సు, విద్యార్హతల ఆధారంగా జీవిత భాగస్వామికి ప్రాధాన్యత ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను విద్యార్హతలు, సాంకేతిక అర్హతల ఆధారంగా భర్తీ చేయాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల కోసం 330 దరఖాస్తులు వచ్చాయి. అందులో 241 దరఖాస్తులు అర్హులుగా గుర్తించారు

వీరిలో జిల్లాల వారీగా ఇప్పటి వరకు 164 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన 77 కుటుంబాలకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్‌రెడ్డి ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లను ఆదేశించారు. ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు ఉద్యోగాల్లో చేరే వారందరి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని సీఎస్ సూచించారు.

Flash...   SSC EXAMS NR SUBMISSIONS - LOGIN PROBLEMS HELP LINES NUMBERS