APCOB Recruitment : ఆప్కాబ్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ

APCOB Recruitment : ఆప్కాబ్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ

APCOB రిక్రూట్‌మెంట్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ విజయవాడలో వివిధ పోస్టులను భర్తీ చేయబోతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము.

విద్యార్హతలకు సంబంధించి ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. వయోపరిమితి 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. జనరల్/ బీసీలకు దరఖాస్తు రుసుముగా 700. SC, ST, వికలాంగులు మరియు EXM అభ్యర్థులకు 500.

దరఖాస్తు ప్రక్రియ విషయానికి వస్తే, దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపాలి. జీతం నెలకు రూ.17,900 నుంచి రూ.47,920. దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ: 21.10.2023గా నిర్ణయించబడింది. నవంబర్‌లో రాత పరీక్ష నిర్వహిస్తారు

Flash...   ఎయిర్ టెల్ టవర్ ఇన్స్టాలేషన్ తో.. భారీగా ఆదాయం పొందండిలా..!