Apple iPad: ఊహకందని డిస్కౌంట్‌.. రూ. 20 వేలకే యాపిల్‌ ఐప్యాడ్‌..!

Apple iPad: ఊహకందని డిస్కౌంట్‌.. రూ. 20 వేలకే యాపిల్‌ ఐప్యాడ్‌..!

Apple iPad: ఊహకందని డిస్కౌంట్‌.. రూ. 20 వేలకే యాపిల్‌ ఐప్యాడ్‌..

ఆపిల్ బ్రాండ్‌కు సంబంధించిన ఉత్పత్తిని కొనుగోలు చేయాలనే కోరిక ఉంది. కానీ యాపిల్ బ్రాండ్ ధరలు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అందుకే యాపిల్ బ్రాండ్ ప్రొడక్ట్స్ కొనాలనుకున్నా ధరపై వెనకడుగు వేస్తున్నారు.

మీరు కూడా అదే ఆలోచనతో ఉన్నారా? అయితే మీ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో మంచి డీల్ అందుబాటులో ఉంది. Apple iPad 9th Gen iPad తక్కువ ధరలో లభిస్తుంది.

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా వివిధ రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లపై భారీ తగ్గింపులను అందజేస్తున్నారు. ఈ క్రమంలో యాపిల్ ఐప్యాడ్ పై కూడా కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. 64 GB కెపాసిటీ Apple iPad 9వ జనరేషన్ iPad అసలు ధర రూ. 33,900 ప్రస్తుత విక్రయంలో భాగంగా 23 శాతం తగ్గింపుతో రూ. 25,999 అందుబాటులో ఉంది. ఇవి కాకుండా, మీరు ICIC మరియు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే, మీకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు గరిష్టంగా రూ. 1500 తగ్గింపు పొందవచ్చు. వీటితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 25000 వరకు తగ్గింపు పొందవచ్చు.

యాపిల్ ఐప్యాడ్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఐప్యాడ్ ఐఓఎస్ 15తో పనిచేస్తుంది. ఇందులో 64 జీబీ స్టోరేజ్ ఉంది. ఇందులో 10.2 అంగుళాల డిస్‌ప్లే ఉంది. కెమెరా విషయానికొస్తే, ఇది 8-మెగాపిక్సెల్ వెనుక కెమెరా మరియు సెల్ఫీల కోసం 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. Apple iPad A13 బయోనిక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 3.5 mm హెడ్‌ఫోన్ జాక్ మరియు ప్రీమియం మెటల్ బాడీ అందించబడ్డాయి.

ఈ ఐప్యాడ్ స్క్రీన్ 2160×1620 పిక్సెల్‌ల రిజల్యూషన్ మరియు 500 నిట్‌ల గరిష్ట ప్రకాశం కలిగి ఉంది. బ్యాటరీ విషయానికొస్తే, ఈ ఐప్యాడ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 గంటల వీడియో స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. నెట్‌వర్క్ విషయానికొస్తే, WiFi, WiFi + సెల్యులార్, డ్యూయల్ బ్యాండ్ WiFi (2.4 GHz, 5 GHz) అందించబడ్డాయి. ఈ ఐప్యాడ్ బరువు 498 గ్రాములు మరియు డిస్ప్లేపై హార్డ్ గ్లాస్ రక్షణ అందించబడింది.

Flash...   అక్కడ స్కూల్ ప్రిన్సిపాల్ గా రోబోని నియమించారు... ఎక్కడంటే