ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా అర్హతతో.. GRSEలో అప్రెంటీస్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా!

ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా అర్హతతో.. GRSEలో అప్రెంటీస్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా!

GRSE Apprentice Jobs 2023 : ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా అర్హతతో.. GRSEలో అప్రెంటీస్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా!

GRSE అప్రెంటీస్ ఉద్యోగాలు 2023 : ITI, డిగ్రీ, డిప్లొమాలు పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు శుభవార్త. గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ 246 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

GRSE అప్రెంటీస్ ఉద్యోగాలు 2023 : గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్ లిమిటెడ్ 246 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా

  • ట్రేడ్ అప్రెంటీస్,
  • గ్రాడ్యుయేట్ అప్రెంటీస్,
  • టెక్నీషియన్ అప్రెంటీస్

పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగ వివరాలు

ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు 2023:

  • ట్రేడ్ అప్రెంటిస్ (ITI) – 134
  • ట్రేడ్ అప్రెంటీస్‌లు (ITI – ఫ్రెషర్స్) – 40
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 25
  • టెక్నీషియన్ అప్రెంటిస్ – 47
  • మొత్తం పోస్టులు – 246

విద్యార్హతలు

GRSE అప్రెంటీస్ అర్హత: అభ్యర్థులు సంబంధిత పోస్టుల ప్రకారం ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుండి డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఐటీఐ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ (ఏఐటీటీ)లో అర్హత సాధించాలి.

వయో పరిమితి

GRSE అప్రెంటిస్ వయో పరిమితి:

ట్రేడ్ అప్రెంటిస్ (అనుభవజ్ఞులైన ITI) అభ్యర్థుల వయస్సు 14 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ట్రేడ్ అప్రెంటీస్ (ఫ్రెషర్స్) అభ్యర్థుల వయస్సు 14 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల మధ్య ఉండాలి.

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ అభ్యర్థుల వయస్సు 14 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి.

టెక్నీషియన్ అప్రెంటీస్ అభ్యర్థుల వయస్సు 14 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి.

Flash...   పీఆర్సీపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం 15.12.21 వివరాలు.

ఎంపిక ప్రక్రియ

GRSE అప్రెంటీస్ ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు వారి అకడమిక్ మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడతారు. అయితే ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలా వద్దా అనేది GRSE అధికార యంత్రాంగం నిర్ణయిస్తుంది. మార్కుల మెరిట్/రాత పరీక్ష తర్వాత.. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి.. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌లో ఇలా దరఖాస్తు చేసుకోండి!

GRSE అప్రెంటిస్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ:

ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా https://www.apprenticeshipindia.gov.in/ వెబ్‌సైట్‌లో అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయాలి. తర్వాత..

గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ యొక్క అధికారిక వెబ్‌సైట్ https://grse.in తెరవండి.

కెరీర్ ఆప్షన్స్‌లో.. ట్రేడ్ అప్రెంటీస్/ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్/ టెక్నీషియన్ అప్రెంటీస్ దరఖాస్తును ఎంచుకోవాలి. తర్వాత

ఆన్‌లైన్ దరఖాస్తు ఎంపికపై క్లిక్ చేయండి.

లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను రూపొందించాలి.

లాగిన్ ఐడీ మరియు పాస్‌వర్డ్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. అంటే దరఖాస్తు ఫారంలో విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. ఆపై అన్ని ముఖ్యమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

అన్ని వివరాలు సరైనవో కాదో మరోసారి సరిచూసుకుని దరఖాస్తును సమర్పించండి.

భవిష్యత్ సూచన కోసం అప్లికేషన్ యొక్క ప్రింటవుట్ భద్రపరచబడాలి.

ముఖ్యమైన తేదీలు

GRSE అప్రెంటిస్ ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైంది.
  • దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 29 అక్టోబర్ 2023