AYUSH: ‘ఆయుష్‌’ పీజీ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్, October 17 వరకు అవకాశం

AYUSH: ‘ఆయుష్‌’ పీజీ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్, October 17 వరకు  అవకాశం

AYUSH: ‘ఆయుష్‌’ పీజీ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్, 17 వరకు దరఖాస్తుకు అవకాశం

తెలంగాణలోని ఆయుష్ పీజీ మెడికల్ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అక్టోబర్ 10న నోటిఫికేషన్ విడుదల చేసింది. AIAPGET-2023 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

పీజీ ఆయుర్వేద, హోమియో, యునాని కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 11, ఉదయం 9 గంటల నుండి అక్టోబర్ 17, సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.

వివరాలు..

* ఆయుష్ పీజీ ప్రవేశాలు (కన్వీనర్ కోటా)

  •  MD ఆయుర్వేద
  •  MD హోమియో
  •  MD యునాని

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీతోపాటు AIAPGET-2023 ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఓసీ వికలాంగులకు 45 శాతం, ఎస్సీ-ఎస్టీ-బీసీ అభ్యర్థులకు 40 శాతం పర్సంటైల్. 31.10.2023 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

రిజిస్ట్రేషన్ మరియు ప్రాసెసింగ్ ఫీజు: OC మరియు BC అభ్యర్థులు రూ.4000 మరియు SC-ST అభ్యర్థులు రూ.3000 చెల్లించాలి. తెలంగాణ, ఏపీ వెలుపల యూజీ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు కౌన్సిల్ ముందు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వెరిఫికేషన్ ఫీజు కింద విదేశీ విద్యార్థులు రూ.5000, ఇతర రాష్ట్రాల విద్యార్థులు రూ.3000 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మెరిట్, AIAPGET-2023 ర్యాంక్ ఆధారంగా.

సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌లైన్ సేవలు..

➥ దరఖాస్తు సమయంలో ఏవైనా సాంకేతిక సమస్యలను ఎదుర్కొనే విద్యార్థులు ఫోన్ నంబర్లలో 9392685856, 7842542216, 9059672216 లేదా ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు: tsayush2023@gmail.com.

➥ నిబంధనలకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఫోన్ నంబర్లలో 9490585796, 7901098840 లేదా ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు: knrugadmission@gmail.com.

Flash...   నాణ్యమైన విద్యలో వెనుకబాటు.

➥ హెల్ప్‌లైన్ సేవలు పేర్కొన్న తేదీలలో ఉదయం 10.00 నుండి సాయంత్రం 6.00 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.10.2023 (ఉదయం 9.00.)

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.10.2023 (సాయంత్రం 5.)

కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 2023-24 కోసం M.D. (UNANI) కోర్సులు – నోటిఫికేషన్

ఆన్‌లైన్ అప్లికేషన్

బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల

2023-24 విద్యా సంవత్సరానికి గానూ ఏపీలో బీపీటీ, బీఎస్సీ పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ అక్టోబర్ 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. బీపీటీతోపాటు వివిధ బీఎస్సీ పారామెడికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ పాసైన అభ్యర్థులు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లోని కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్ల భర్తీకి అక్టోబర్ 8 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీలో బీఎన్‌వైఎస్ కోర్సు వివరాలు ఇలా ఉన్నాయి

విజయవాడలోని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ దాని అనుబంధ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి బిఎన్‌వైఎస్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇంటర్మీడియట్ (BIPC)లో 50% మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు అక్టోబర్ 12లోగా దరఖాస్తులను సమర్పించాలి.

అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ‘స్పాట్’ కౌన్సెలింగ్, ఎప్పుడు?

గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ పరిధిలోని 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు అక్టోబర్ 11న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ విషయమై యూనివర్సిటీ రిజిస్ట్రార్ జి.రామారావు అక్టోబర్ 6న ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల్లో అగ్రికల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ కోర్సుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నారు. గుంటూరులోని లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం లాంఫాం పాలిటెక్నిక్‌లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

Flash...   Jaggery Tea: చలికాలంలో బెల్లం టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు...