Bank Holidays: నవంబర్‌లో బ్యాంకులకు 15 రోజులు సెలవు.. ఏయే రోజుల్లో అంటే..

Bank Holidays: నవంబర్‌లో బ్యాంకులకు 15 రోజులు సెలవు.. ఏయే రోజుల్లో అంటే..

నవంబర్‌లో బ్యాంకులకు సెలవులు: దేశంలో అనేక బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టడంతో మారుమూల గ్రామాల్లోని ప్రజలకు సైతం బ్యాంకు ఖాతాలు అందుబాటులోకి వచ్చాయి.

దీంతో అందరూ బ్యాంకు పనివేళలు, బ్యాంకులకు సెలవులపై ఆసక్తిగా చూస్తున్నారు.

ఏ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు లభిస్తాయి? ఇందులో భాగంగా బ్యాంకులకు సెలవులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా నవంబర్ నెల సెలవులను ఆర్బీఐ ప్రకటించింది. నవంబర్‌లో 15 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. దేశంలోని వివిధ ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక రోజుల కారణంగా ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. నవంబర్ నెలలో బ్యాంకులకు ఏయే రోజులు సెలవులు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

* నవంబర్ 1న కన్నడ రాజతోత్సవం/కర్వా చౌత్/కుట్ పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. అయితే ఇది బెంగళూరు, ఇంఫాల్ మరియు సిమ్లాలోని బ్యాంకులకు మాత్రమే పరిమితమైంది.

* వంగల పండుగను పురస్కరించుకుని షిల్లాంగ్‌లోని బ్యాంకులకు నవంబర్ 10న సెలవు ప్రకటించారు.

* అగర్తల, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, జైపూర్, కాన్పూర్ మరియు లక్నోలలో బ్యాంకులకు నవంబర్ 13న సెలవులు ప్రకటించారు. వాస్తవానికి దీపావళి నవంబర్ 12న వస్తుంది మరియు ఆ రోజు ఆదివారం వస్తుంది.

* నవంబర్ 14న దీపావళి బలిప్రతిపాద పండుగ కారణంగా అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, గ్యాంగ్‌టక్, ముంబై మరియు నాగ్‌పూర్‌లోని బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

* గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో మరియు సిమ్లాలోని బ్యాంకులకు నవంబర్ 15న సెలవు ప్రకటించారు.

* నవంబర్ 20న ఛత్ పండుగను పురస్కరించుకుని… పాట్నా మరియు రాంచీలలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

* నవంబర్ 23న సెంగ్ కుత్సునెం కారణంగా… డెహ్రాడూన్, షిల్లాంగ్ లలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

* నవంబర్ 27న గురునానక్ జయంతిని పురస్కరించుకుని అహ్మదాబాద్, ఇంఫాల్, ఏపీ మినహా అన్ని బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

Flash...   POST OFFICE MONTHLY INCOME POLICY : నెల‌వారీ ఆదాయానిచ్చే పోస్టాఫీసు మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్

* ఇక నవంబర్ 30న కనకదాస జయంతి రోజున బెంగళూరులో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

వీటితో పాటు..

ఈ పండుగలతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాల్లో బ్యాంకులు పని చేయని సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నవంబర్ 5, 11, 12, 19, 25, 26, రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారం బ్యాంకులు సేవలు అందించవు. ఇదిలా ఉండగా ఈ నెలాఖరులో బ్యాంకులకు భారీ సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 23, 24, 25, 26, 27, 28, 29 అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు. అదే సమయంలో, బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.