BOM: నెలకి 80,000 జీతం తో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

BOM: నెలకి 80,000 జీతం తో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణెలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు.

బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి.

వివరాలు..

* మొత్తం ఖాళీలు: 100

  • క్రెడిట్ ఆఫీసర్ (స్కేల్-II): 50 పోస్టులు
  • క్రెడిట్ ఆఫీసర్ (స్కేల్-III): 50 పోస్టులు

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, MBA (పూర్తి సమయం), బ్యాంకింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్ & ఫైనాన్స్, మార్కెటింగ్, ఫారెక్స్, క్రెడిట్, PGDBA, PGDBM, CA, CFA, ICWA ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 30.09.2023 నాటికి క్రెడిట్ ఆఫీసర్ (స్కేల్-II) పోస్టులకు 25-32 ఏళ్లు మరియు క్రెడిట్ ఆఫీసర్ (స్కేల్-III) పోస్టులకు 25-35 ఏళ్లు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము: రూ.1180. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.118 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

రాత పరీక్ష విధానం: రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుండి 50 ప్రశ్నలు-100 మార్కులు మరియు జనరల్ బ్యాంకింగ్ నుండి 50 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.

పరీక్షా కేంద్రాలు: పాట్నా, చండీగఢ్, రాయ్‌పూర్, ఢిల్లీ NCR, పనాజీ, అహ్మదాబాద్, రాంచీ, భోపాల్, ఔరంగాబాద్, ముంబై, నాగ్‌పూర్, పూణే, జైపూర్, లక్నో, కోల్‌కతా, గౌహతి, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురం.

జీతం: క్రెడిట్ ఆఫీసర్ (స్కేల్-II) పోస్టులకు రూ.48,170-రూ.69,810; క్రెడిట్ ఆఫీసర్ (స్కేల్-III) పోస్టులకు రూ.63,840-రూ.78,230 చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 23.10.2023.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ, ఫీజు చెల్లింపు: 06.11.2023.

నోటిఫికేషన్ pdf: Click Here

Flash...   APSCSCL: ఏపీ పౌర సరఫరాల శాఖలో రాత పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు ఎంపిక...

ఆన్‌లైన్ అప్లికేషన్ : 

వెబ్సైట్ : bankofmaharashtra.in