క్రేజీ బైక్ Yamaha RX100 లాంచ్ ఎప్పుడంటే..!

క్రేజీ బైక్ Yamaha RX100 లాంచ్ ఎప్పుడంటే..!

ఒకప్పుడు ఐకానిక్ క్రేజీ బైక్ యమహా ఆర్‌ఎక్స్ 100 భారత మార్కెట్లో మళ్లీ ఎప్పుడు విడుదల అవుతుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే ఈ బైక్ 2026 నాటికి మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

యమహా ఆర్‌ఎక్స్ 100 తొలిసారిగా 1985లో విడుదలై.. 1990 నాటికి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యువత ఎక్కువగా ఈ బైక్‌ను ఇష్టపడుతున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల 1996 తర్వాత ఈ బైక్ విడుదల కాలేదు.కానీ ఇప్పుడు కూడా ఈ బైక్‌లు మార్కెట్‌లో కనిపిస్తున్నాయి.

పాతవాటిని రీడిజైన్ చేసి ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. అదే మోడల్‌లో కొత్త RX 100ని లాంచ్ చేయాలని కంపెనీకి చాలా అభ్యర్థనలు వస్తున్నాయి. అయితే ఈ బైక్‌ను రీలాంచ్ చేయడానికి కంపెనీ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. యమహా ఆర్‌ఎక్స్ 100 కొత్త టెక్నాలజీ, ప్రస్తుత నిబంధనల ప్రకారం అప్‌డేట్ చేయబడిన ఇంజన్, ఎల్‌ఈడీ లైట్లు, డిస్క్ బ్రేక్‌లు, అల్లాయ్ వీల్స్, మెరుగైన సస్పెన్షన్ వంటి ఆప్షన్‌లతో మళ్లీ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Flash...   ECIL: ఈసీఐఎల్ హైదరాబాద్ లో అప్రెంటిస్ పోస్ట్ లు .. స్టైపెండ్ ఎంతంటే..