Cyber crime: ‘ఫ్రీ రీఛార్జ్‌’ అంటూ మీక్కూడా మెసేజ్‌ వస్తుందా.? అసలు కథేంటంటే..

Cyber crime: ‘ఫ్రీ రీఛార్జ్‌’ అంటూ మీక్కూడా మెసేజ్‌ వస్తుందా.? అసలు కథేంటంటే..

సమాజంలో నేరాల తీరు రోజురోజుకూ మారుతోంది. ప్రత్యక్షంగా దాడి చేసి దోచుకునే వారు, ఇప్పుడు ఎక్కడెక్కడో కూర్చుని ఖాతాలో డబ్బులు వేస్తున్నారు.

చిన్న లింక్ పంపి డబ్బులు తీసుకుంటున్నారు. టెక్నాలజీ పెరిగిందని సంతోషించాలో, సైబర్ నేరాలు పెరిగిపోయాయని బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది. సైబర్ నేరగాళ్లు ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకుని ఇప్పుడు ఎన్నికల సీజన్‌ను కూడా ఉపయోగించుకుంటున్నారు.

మరోవైపు పార్టీలు, రాజకీయ నేతలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటే.. కొందరు సైబర్ నేరగాళ్లు దీన్ని సద్వినియోగం చేసుకున్నారు. ప్రజలను ఉచితంగా ప్రలోభపెట్టి దోచుకోవాలని పన్నాగం పన్నుతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో మూడు నెలల పాటు ఉచితంగా ఫోన్ రీచార్జ్ ఇస్తున్నట్లు ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. వాట్సాప్ గ్రూపుల్లో కూడా ముందూ చూడకుండా పోస్టులు పెడుతున్నారు. ఈ మెసేజ్ దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.

దిగువ పేర్కొన్న లింక్‌పై క్లిక్ చేసి 3 నెలల పాటు ఉచిత రీఛార్జ్‌ని పొందండి అనేది సందేశం యొక్క సారాంశం. ఈ సందేశం తెలుగులో కూడా ఉండడం గమనార్హం. ఈ మెసేజ్ కాస్త వైరల్ కావడంతో ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ స్పందించింది. ఫ్యాక్ట్ చెక్‌లో భాగంగా ఆ మెసేజ్ పూర్తిగా ఫేక్ అని తేల్చారు. అయితే ఇప్పటి వరకు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకపోయినా.. ఇలాంటి నకిలీ లింక్‌లను క్లిక్ చేస్తే మోసపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.

కేవలం ఉచిత రీఛార్జ్ మాత్రమే కాదు, ఎన్నికల సమయంలో కొన్ని పార్టీలు ఈ కామర్స్ సైట్లలో డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయని కొన్ని లింక్‌లు కూడా వైరల్ అవుతున్నాయి. లింక్ క్లిక్ చేసి షాపింగ్ చేస్తే భారీ డిస్కౌంట్ పొందవచ్చని మెసేజ్ లో పేర్కొన్నారు. అయితే ఇలాంటి ఫేక్ లింక్ లను క్లిక్ చేయడం ద్వారా ఖాతాల్లోని డబ్బులు పోయే ప్రమాదం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Flash...   Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ నుంచి మరో భారీ సేల్‌.. దీపావళికి ఊహకందని డిస్కౌంట్స్‌.