Cyclone Hamoon: దూసుకొస్తున్న తుఫాను: ఏపీకి భారీ వర్ష సూచన.. !

Cyclone Hamoon: దూసుకొస్తున్న తుఫాను: ఏపీకి భారీ వర్ష సూచన.. !

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఈ మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు మేఘావృతమై ఉంటుంది. ఇది మరో 24 గంటల్లో తుఫాన్‌గా మారనుంది. ఏపీ సహా మరో రెండు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా అల్పపీడనంగా మారింది. అది బలపడింది. ఒడిశాలోని పరదీప్ తీరానికి ఆగ్నేయంగా 610 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో తుపాన్‌గా మారనుంది. ఇది క్రమంగా వాయువ్య దిశగా కదులుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.

దీనికి సైక్లోన్ హమూన్ అని పేరు పెట్టారు. ఇరాన్ ఈ పేరును సూచించింది. ఈ నెల 25 నాటికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 25 వరకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై తుపాను ప్రభావం చూపనుంది. ఈ మూడు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం వెంబడి వాయుగుండం కదిలే అవకాశం ఉన్నందున ఈ రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కోస్తా నుంచి 200 కిలోమీటర్ల దూరం నుంచి కదులుతున్నందున తుపాను ప్రభావం ఏపీ, ఒడిశాపై తీవ్రంగా ఉండకపోవచ్చని భువనేశ్వర్‌లోని భారత వాతావరణ కేంద్రం ప్రాంతీయ డైరెక్టర్ ఉమాశంకర్ దాస్ తెలిపారు. తీరం దాటే సమయంలో బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.

Flash...   సెలవులలో చిన్న మార్పు .. 12 నుంచి సంక్రాంతి సెలవులు..