డిప్లొమా, ఇంజినీరింగ్‌ అమ్మాయిలకు స్కాలర్‌షిప్స్! ఎలా అప్లై చేయాలంటే..

డిప్లొమా, ఇంజినీరింగ్‌ అమ్మాయిలకు స్కాలర్‌షిప్స్! ఎలా అప్లై చేయాలంటే..

ప్రతిభ, చదువుకోవాలనే తపన ఉండి ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకోలేకపోతున్న విద్యార్థుల కోసం ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది.

వీటికి ఎవరు అర్హులు?

చదువుపై ఆసక్తి ఉన్నా ఆర్థికంగా నిలదొక్కుకోలేని వారికి అండగా నిలిచేందుకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ‘ప్రగతి స్కాలర్ షిప్’ల పేరుతో ఏటా పదివేల మందికి స్కాలర్ షిప్ అందజేస్తోంది. డిప్లొమా, ఇంజినీరింగ్ విద్యార్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇదే అర్హత

లాటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమా లేదా ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం, డిప్లొమా/ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న బాలికలు ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ కోర్సులో చేరి ఉండాలి.

ఎంపిక ఇలా ఉంటుంది

డిప్లొమా స్థాయిలో 5,000 మందికి మరియు ఇంజనీరింగ్ స్థాయిలో 5,000 మందికి ఈ స్కాలర్‌షిప్‌లు ఇవ్వబడతాయి. డిప్లొమా అభ్యర్థులను పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. ఇంజినీరింగ్ అభ్యర్థులను ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 10వ తరగతి డిప్లొమా అడ్మిషన్ల మధ్య రెండేళ్ల కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. కుటుంబ ఆదాయం 8 లక్షల లోపు ఉండాలి. వివాహితులు కూడా అర్హులు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ స్కాలర్‌షిప్‌ల కోసం రాష్ట్రాల వారీగా కోటా ఉంది. డిప్లొమా కేటగిరీలో ఏపీ నుంచి 318 మందికి, తెలంగాణ నుంచి 206 మందికి వీటిని అందజేయనున్నారు. అలాగే ఇంజినీరింగ్ విభాగంలో ఏపీ నుంచి 566 మందికి, తెలంగాణ నుంచి 424 మందికి అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల కేటాయింపులు కూడా ఉంటాయి.

స్కాలర్‌షిప్ ఎంత?

స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు డిప్లొమా విద్యార్థులకు మూడేళ్లు, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏడాదికి రూ.50,000 చెల్లిస్తారు. ప్రతి సంవత్సరం నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. ఫీజులు, వసతి మరియు పుస్తకాలు వంటి ఖర్చుల కోసం వీటిని ఉపయోగించవచ్చు.

Flash...   ఎవరి ప్రయోజనాలకు ఈ పరీక్షలు?

అభ్యర్థులు ‘AICTE’ వెబ్‌సైట్ (www.aicte-india.org)లో దరఖాస్తును పూరించవచ్చు. డిసెంబర్ 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.