దీపావళి బోనాంజా … ప్రభుత్వ ఉద్యోగులకు అసలైన పండుగ …!

దీపావళి బోనాంజా  … ప్రభుత్వ ఉద్యోగులకు అసలైన పండుగ …!

దేశంలో దసరా, దీపావళి పండుగలు వచ్చాయి అంటే చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలు పెంచడమే కాకుండా మరో పక్క బోనస్ కూడా ప్రకటిస్తున్నాయి. అంతేకాదు తమ వద్ద ఏడాది పొడవునా పనిచేసిన ఉద్యోగులు మిఠాయిల పెట్టెలతో మరింత ఆనందాన్ని పొందుతున్నారు. కాకపోతే కంపెనీ లాభాలకు అనుగుణంగా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ బోనస్ లు అందజేయడం గమనార్హం. దీపావళి అంటే అందరూ ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ.

ఈ పండుగ సందర్భంగా కంపెనీలు తమ ఉద్యోగులను మరింత సంతోషంగా ఉంచేందుకు బోనస్‌లను ప్రకటిస్తాయి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దీపావళి ధమాకా ప్రకటించాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపుదల ప్రకటించి రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త అందించిందని చెప్పవచ్చు. తమిళనాడు ఉద్యోగులకు 42 శాతం డీఏ నుంచి 46 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా పెరగనున్నాయని సమాచారం. పెంచిన డీఏ కూడా జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని, నవంబర్ లో దీపావళి సందర్భంగా అక్టోబర్ జీతంతో పాటు జూలై నుంచి అక్టోబర్ వరకు బకాయిలు చెల్లించనున్నట్లు సమాచారం. కాకపోతే ఈ పెరిగిన డీఏ వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏ పెంచగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారని.. ప్రతి ఏటా డీఏ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.2,546 కోట్ల అదనపు భారం పడుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. మరోవైపు రైల్వే శాఖ కూడా తన ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ను ప్రకటించింది.

Flash...   PRC NEWS: జగన్‌తో ముగిసిన సజ్జల, బుగ్గన భేటీ