Free training for women: మహిళలకు ఉచిత శిక్షణ

Free training for women: మహిళలకు ఉచిత శిక్షణ

అమలాపురం టౌన్ : అమలాపురంలోని శ్రీ సత్యసాయి కళ్యాణ మంటపంలో శుక్రవారం నుంచి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల పర్యవేక్షణలో హైదరాబాద్ రూరల్ బ్యాంకర్లు, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ సహకారంతో మహిళా యువతకు మగ్గం, జర్దోసీలో ఉచిత శిక్షణ ప్రారంభమైంది. 37 రోజుల పాటు జరిగే ఈ ఉచిత శిక్షణ కార్యక్రమానికి కోనసీమ నలుమూలల నుంచి 80 మంది మహిళలు శిక్షణ కోసం వచ్చారు.

తరగతులను అమలాపురం మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, హైదరాబాద్ బ్యాంకర్స్ రూరల్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ జి.రామారావు ప్రారంభించారు. జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు అడబాల కొండబాబు, అమలాపురం డివిజన్ కన్వీనర్ డాక్టర్ జి.ప్రభాకరరాజు ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.

ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ సహాయ సంచాలకులు రామారావు మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించామన్నారు. మహిళల దుస్తుల అలంకరణలో మగ్గం, జర్దోసీ పనులకు విపరీతమైన డిమాండ్ ఉన్నందున మహిళల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఈ ఉచిత శిక్షణను నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధి డాక్టర్ ప్రభాకరరాజు తెలిపారు.

వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు కేశవవర్మ, సుధాకర్ పాల్గొన్నారు. మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ నుంచి నలుగురు ఫ్యాకల్టీలు వచ్చారు. వారికి 37 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు.

Flash...   LIVE: ఏపీలో పీఆర్సీ పోరాటంలో ఉద్రిక్తత