ఈ రోజుల్లో లక్షల్లో జీతాలు మామూలే. పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని లక్షల్లో ప్యాకేజీ ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
సాఫ్ట్‌వేర్‌తోపాటు అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి. అయితే డిగ్రీ, పీజీ చేసిన వారికే ఇంత భారీ వేతనాలు అందుతున్నాయి. మరి డిగ్రీ లేని వారి మాటేమిటి? డిగ్రీ సర్టిఫికెట్ లేకున్నా లక్షల రూపాయల జీతం వస్తుందా..? అయితే ఎలాంటి కోర్సులు చదవాలి? ఇప్పుడు చూద్దాం.
మార్కెట్‌లో అన్ని ఉద్యోగాలలో పోటీ చాలా ఉంది. దీని ప్రకారం, భారీ జీతాలు ఉన్నాయి. ఉద్యోగం రావాలంటే కనీస డ్రిగి పూర్తి చేయాలని చాలా కంపెనీలు చెబుతున్నాయి. కానీ కొన్ని ఉద్యోగాలకు డ్రిగి లేకపోయినా ప్రత్యేక శిక్షణ, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. ఏదైనా ఒక కోర్సులో పట్టు సాధించాక.. ఆ కోర్సు చేసినట్టు సర్టిఫికేషన్ ఇస్తే చాలు.. డిగ్రీ అవసరం లేదు కానీ ఉద్యోగం ఇస్తారు. అలాంటి కోర్సుల వివరాలను పరిశీలిస్తే..
Data Analyst
ప్రతి కంపెనీ డేటా విశ్లేషకులను ఇష్టపడుతుంది. EXCEL, SQL, డేటా విజువలైజేషన్ సాఫ్ట్‌వేర్‌లలో నైపుణ్యం ఉంటే.. ఉద్యోగాలు ఇస్తున్నారు. డేటాను సేకరించడం, ప్రాసెస్ చేయడం మరియు విశ్లేషించడం అనేది డేటా విశ్లేషకులు చేసే పని. నైపుణ్యాలు ఉంటే ఈ ఉద్యోగాలకు డిగ్రీ అవసరం లేదని కొన్ని కంపెనీలు చెబుతున్నాయి.
Digital marketing
టెక్నాలజీ రోజురోజుకూ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో డిజిటల్ యుగం దూసుకుపోతోంది. ఈ క్రమంలో డిజిటల్ మార్కెట్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఇందులో లభించే ఉద్యోగాలు డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగాలు. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన కోర్సులలో ఒకటి. సోషల్ మీడియా మార్కెటింగ్, SEO, ఇమెయిల్ మార్కెటింగ్‌లో పట్టు సాధించి, Google మరియు HubSpot వంటి ప్లాట్‌ఫారమ్‌ల నుండి ధృవీకరణ పొందిన వారికి మార్కెట్లో అనేక అవకాశాలు ఉన్నాయి.
Web Developer
సాంకేతికత ఆధారంగా వెబ్ డెవలపర్‌లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ప్రతి చిన్న, పెద్ద కంపెనీ వారి కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌లను రూపొందిస్తోంది. సో.. వెబ్ డెవలప్ మెంట్ కోర్సు పూర్తి చేసి అందులో నాలెడ్జ్ ఉంటే లక్షల్లో జీతం పొందడమే కాకుండా ఫ్రీలాన్సింగ్ ద్వారా బోలెడంత డబ్బు సంపాదించవచ్చు.
Software developer
సాఫ్ట్‌వేర్ రంగంలో కూడా డిగ్రీ లేకుండా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన కొన్ని కోర్సులు నేర్చుకుని, కోడింగ్ పరిజ్ఞానం ఉంటే, మీకు భారీ జీతంతో ఉద్యోగాలు లభిస్తాయి. ఇందుకోసం మంచి సాఫ్ట్‌వేర్ కోర్సు నేర్చుకోవడం ముఖ్యం.
Real estate agent
డిగ్రీతో సంబంధం లేకుండా రియల్ ఎస్టేట్ రంగంలో చాలా భవిష్యత్తు ఉంది. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే, డిగ్రీ లేకపోయినా రియల్ ఎస్టేట్ ఏజెంట్లలో చేరి లక్షల్లో సంపాదించవచ్చు. ఈ మార్కెటింగ్ కోసం ప్రత్యేక కోర్సులు కూడా చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆకాశమంత కమీషన్లతో పాటు మంచి వేతనం ఉంటుంది.