కాకినాడ కో ఆపరేటివ్ బ్యాంక్ లో భారీగా ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో!

కాకినాడ కో ఆపరేటివ్ బ్యాంక్ లో భారీగా ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో!

కాకినాడ కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపి కబురు అందించింది. ఈ సంస్థ 33 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

క్లర్క్ కమ్ క్యాషియర్ ఉద్యోగ ఖాళీలు 16 మరియు ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 9. అటెండెంట్ (సబ్ స్టాఫ్) 5 ఖాళీలు, అసిస్టెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 2 ఖాళీలు మరియు మేనేజర్-లా 1 ఖాళీలు ఉన్నాయి.

ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కూడా అనుభవం కలిగి ఉండాలి. 6 అక్టోబర్ 2023 నాటికి 34 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. బీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి.

వెబ్‌సైట్ నుండి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసి, దరఖాస్తులను పూరించిన తర్వాత, ఈ ఉద్యోగ ఖాళీల కోసం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కాకినాడ కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్, రామారావు పేట, కాకినాడ చిరునామాకు దరఖాస్తు చేసుకోవాలి. ఆఫీసర్ క్లర్క్ కమ్ క్యాషియర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 500 రూపాయలు ఉంటుందని సమాచారం.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. అసిస్టెంట్ సీఈఓ, మేనేజర్ పోస్టులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలు కాగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు. ఈ ఉద్యోగ ఖాళీలకు నిర్ణీత మొత్తంతో డీడీ తీసుకుని దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Flash...   డిగ్రీ అర్హత తో ఎయిర్ పోర్ట్ లో 906 సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలకి అప్లై చేయండి ..