Israel – India: ఇజ్రాయెల్ నుంచి 500కు పైగా ఐటీ సంస్థల చూపు భారత్ వైపు.!

Israel – India: ఇజ్రాయెల్ నుంచి 500కు పైగా ఐటీ సంస్థల చూపు భారత్ వైపు.!

ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ లోని టెక్ కంపెనీలు ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, వారు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా ఇజ్రాయెల్ నుండి భారతదేశం లేదా యూరప్‌కు తరలించాలనుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే పలు సంస్థలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ తన వార్షిక ఆదాయంలో 14 శాతం ఐటీ రంగం నుంచి పొందుతోంది.

ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ లోని టెక్ కంపెనీలు ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, వారు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా ఇజ్రాయెల్ నుండి భారతదేశం లేదా యూరప్‌కు తరలించాలనుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే పలు సంస్థలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ తన వార్షిక ఆదాయంలో 14 శాతం ఐటీ రంగం నుంచి పొందుతోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఇది చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్, విప్రో, టీసీఎస్ సహా 500కి పైగా అంతర్జాతీయ ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. వీటిలో మొత్తం లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఇజ్రాయెల్‌లోని IT కంపెనీలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు చెందిన పలు కీలక ప్రాజెక్టులను చేపడుతున్నాయి. యుద్ధ నేపథ్యంలో సంస్థ సజావుగా సాగే అవకాశం లేకపోవడంతో ఆయా కంపెనీలు చేపట్టిన ప్రాజెక్టులను భారత్ సహా యూరప్ దేశాలకు తరలించాలని నిర్ణయించారు. మరోవైపు ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న కొందరు ఇజ్రాయెల్ వాసులు సైన్యంలో పని చేసేందుకు వెళ్లగా.. మానవ వనరుల కొరత వారిని వెంటాడుతోంది. దీంతో ఇతర దేశాల్లోని కంపెనీ ఉద్యోగులతో ప్రాజెక్టులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే వీటిలో చాలా కంపెనీలు భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయని ఐటీ వర్గాలు తెలిపాయి. దీనికి ప్రధాన కారణం భారతదేశంలో అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని చాలా కంపెనీలు భావిస్తున్నాయి

Flash...   AP ప్రజలకు శుభవార్త.. ట్రూఅప్‌ ఛార్జీలు తిరిగి వచ్చేస్తున్నాయి.