ISRO: విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో 435 అప్రెంటిస్‌ ఖాళీలు, అర్హతలివే

ISRO: విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో 435 అప్రెంటిస్‌ ఖాళీలు, అర్హతలివే

కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

దీని ద్వారా 435 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు డిగ్రీ అర్హత, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థులు అర్హులు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 7న వాక్-ఇన్ జరగనుంది.

వివరాలు…

* అప్రెంటిస్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 435

1) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు: 273

అప్రెంటీస్ శిక్షణ వ్యవధి: 12 నెలలు.

విభాగాలు: ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జీ, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఫైర్ & సేఫ్టీ ఇంజనీరింగ్, హోటల్ మేనేజ్‌మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీ.

అర్హత:

సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60% మార్కులతో BTech/ BE/ BSc/ BCom/ BA/ బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్.

వయోపరిమితి:

30.09.2023 నాటికి జనరల్-28, OBC-31, SC-33, ST-33 సంవత్సరాలు. వికలాంగులైతే జనరల్-38, ఓబీసీ-41, ఎస్సీ-43, ఎస్టీ-43 ఏళ్లు

స్టైపెండ్: నెలకు రూ.9000.

2) టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీలు: 162

అప్రెంటీస్ శిక్షణ వ్యవధి: 12 నెలలు.

విభాగాలు: ఆటోమొబైల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంట్ టెక్నాలజీ.

అర్హత: టెక్నీషియన్ అప్రెంటీస్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.

వయోపరిమితి: 30.09.2023 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. వయోపరిమితి OBCలు-3, SC-SC అభ్యర్థులు-5 మరియు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వర్తిస్తుంది.

స్టైపెండ్: నెలకు రూ.8000.

ఎలా దరఖాస్తు చేయాలి: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

ఎంపిక ప్రక్రియ: ఎంపిక మెరిట్ ఆధారంగా ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక:

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కలంసేరి, ఎర్నాకులం జిల్లా, కేరళ.

ఇంటర్వ్యూ తేదీ: 07.10.2023.

Flash...   ఫ్యాన్సీ మొబైల్ నెంబర్‌ కావాలా..? ఆన్‌లైన్‌ లో ఇలా సొంతం చేసుకోవచ్చు..

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు.