Job fair for youth: నిరుద్యోగ యువతకు జాబ్‌మేళా..!

Job fair for youth: నిరుద్యోగ యువతకు జాబ్‌మేళా..!

నూజివీడు : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్, సీ డీఏపీ, జిల్లా ఉపాధి కల్పన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు.

పట్టణంలోని శ్రీ శారద కళాశాలలో ఈనెల 31న నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్‌ను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. జాబ్ మేళాకు 12 కంపెనీల ప్రతినిధులు వస్తారని, సుమారు 850 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకునేందుకు జిల్లా స్కిల్ డెవలప్ మెంట్ అధికారి గంటా సుధాకర్ వచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, వైఎస్ ఆర్ సీపీ పట్టణ అధ్యక్షుడు శీలం రాము, శారద కళాశాల చైర్మన్ కుప్పాల శంకరరావు, స్కిల్ హబ్ కోఆర్డినేటర్ డి.రామకృష్ణ పాల్గొన్నారు.

Flash...   How to install and access JVK Mobile app