10th , ITI అర్హతతో.. NCL లో 1140 అప్రెంటీస్ పోస్టులు.. అప్లై చేసుకోండిలా

10th , ITI  అర్హతతో.. NCL లో 1140 అప్రెంటీస్ పోస్టులు.. అప్లై చేసుకోండిలా

NCL Apprentice Jobs 2023 : ఐటీఐ అర్హతతో.. NCLలో 1140 అప్రెంటీస్​ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!

NCL అప్రెంటీస్ ఉద్యోగాలు 2023 తెలుగులో : ITI చేసి ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. నార్తర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ 1140 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు మీకోసం.

NCL అప్రెంటిస్ ఉద్యోగాలు 2023: మినీ రత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ నార్తర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (NCL) 1140 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగ వివరాలు

  • ఫిట్టర్ – 543 పోస్ట్‌లు
  • ఎలక్ట్రీషియన్ – 370 పోస్టులు
  • వెల్డర్ – 155 పోస్ట్లు
  • మోటార్ మెకానిక్ – 47
  • ఎలక్ట్రానిక్ మెకానిక్ – 13 పోస్టులు
  • ఆటో ఎలక్ట్రీషియన్ – 12
  • మొత్తం అప్రెంటిస్ పోస్టులు – 1140

విద్యార్హతలు

NCL అప్రెంటీస్ అర్హత: అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి 10వ తరగతి లేదా 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఆయా పోస్టుల ప్రకారం (ఎలక్ట్రానిక్ మెకానిక్/ ఎలక్ట్రీషియన్/ ఫిట్టర్/ వెల్డర్/ మోటార్ మెకానిక్/ ఆటో ఎలక్ట్రీషియన్) ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ప్రాధాన్యంగా NCVT/ SCVT ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయో పరిమితి

NCL అప్రెంటీస్ వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 31 అక్టోబర్ 2023 నాటికి 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల అభ్యర్థులకు వయో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక ప్రక్రియ

NCL అప్రెంటీస్ ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు 10వ తరగతి + ITI ట్రేడ్ టెస్ట్‌లో మెరిట్ ఆధారంగా అప్రెంటిస్ పోస్టులకు ఎంపిక చేయబడతారు.

శిక్షణ – స్టైపెండ్

NCL అప్రెంటీస్ శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో వారికి నెలకు రూ.8,050 స్టైఫండ్ అందజేస్తారు. వెల్డర్ పోస్టులకు 7,700 స్టైపెండ్ ఇస్తారు.

Flash...   కేరళకు ఎట్లా సాధ్యమైంది?

ఇలా దరఖాస్తు చేసుకోండి!

NCL అప్రెంటీస్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ: ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్రెంటీస్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా NCL అధికారిక వెబ్‌సైట్ https://www.nclcil.in/ తెరవండి.

  • NCL అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2023 లింక్‌పై క్లిక్ చేసి దాన్ని తెరవండి.
  • దరఖాస్తు ఫారమ్‌లో మీ వ్యక్తిగత మరియు విద్యా వివరాలను నమోదు చేయాలి.
  • ముఖ్యమైన విద్యార్హత పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • ఒకసారి అన్ని వివరాలను తనిఖీ చేసి దరఖాస్తును సమర్పించండి.
  • అప్లికేషన్ యొక్క ప్రింటవుట్ తీసుకొని భవిష్యత్తు సూచన కోసం ఉంచండి.

ముఖ్యమైన తేదీలు

NCL అప్రెంటిస్ దరఖాస్తు చివరి తేదీ:

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ: 5 అక్టోబర్ 2023
  • దరఖాస్తుకు చివరి తేదీ: 2023 అక్టోబర్ 15