NIMS Admissions : నిమ్స్ హైద్రబాద్ లో సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలు

NIMS Admissions : నిమ్స్ హైద్రబాద్ లో సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలు

నిమ్స్ అడ్మిషన్స్ : నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) నెఫ్రాలజీ విభాగం, హైదరాబాద్ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్ ప్రోగ్రామ్‌లో సర్టిఫికేట్ కోర్సును అందిస్తోంది.

ఈ కోర్సులో ప్రవేశానికి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఒక సంవత్సరం వ్యవధి గల ఫుల్‌టైమ్ ప్రోగ్రామ్‌లో నాలుగు సీట్లు ఉన్నాయి.

గుర్తింపు పొందిన కళాశాల నుండి B.Sc (నర్సింగ్, సైకాలజీ, లైఫ్ సైన్సెస్, డయాలసిస్ టెక్నాలజీ) MBBS, MD, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. అభ్యర్థుల వయస్సు 20 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితి వర్తిస్తుంది.

ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.5000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.4,000. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 31 చివరి తేదీ. దరఖాస్తు హార్డ్ కాపీలను పంపడానికి నవంబర్ 3 చివరి తేదీ. పూర్తి వివరాలకు www.nims.edu.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Flash...   Ammavodi scheme to Orphans for the year 2021- 22