వైద్యశాలల్లో ఉపాధి అవకాశాలు. 909 పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

వైద్యశాలల్లో ఉపాధి అవకాశాలు.  909 పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, కళావతి సరన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మరియు రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్‌లు సంయుక్తంగా 909 పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి.

ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

మొత్తం 909 పోస్టుల్లో.. ఫ్యామిలీ వెల్ఫేర్ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేటర్-2, కంప్యూటర్-1, రేడియోగ్రాఫర్-22, ఎక్స్-రే అసిస్టెంట్-18, ఈసీజీ టెక్నీషియన్-11, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్-159, జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్-51, ఫార్మసీ-13 , ఫిజియోథెరపిస్ట్ -42 , ఆపరేషన్ థియేటర్ అటెండెంట్-20, నర్సింగ్ అటెండెంట్-218, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్-274, ఇతర పోస్టులు-78.

పోస్టు ప్రకారం అభ్యర్థులు సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు రుసుము రూ.600. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

సీబీటీలో…

కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 60 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.

ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మరియు హిందీ భాషలలో బహుళ ఎంపిక విధానంలో ఉంటుంది.

నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ప్రశ్నల స్థాయి మీ కనీస అర్హత స్థాయిపై ఆధారపడి ఉంటుంది. పోస్టును బట్టి కనీస అర్హత స్థాయి 10వ తరగతి.. పరీక్ష సిలబస్ కూడా అదే స్థాయిలో ఉంటుంది.

పరీక్ష తేదీని వెబ్‌సైట్‌లో.. అడ్మిట్ కార్డ్ ద్వారా ప్రకటిస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ: 25.10.2023

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 26.10.2023

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: నవంబర్ మొదటి వారం, 2023

పరీక్ష: నవంబర్ నాల్గవ వారం, 2023

ఫలితాల ప్రకటన: డిసెంబర్ మొదటి వారం, 2023

డాక్యుమెంట్ వెరిఫికేషన్: డిసెంబర్ రెండవ వారం, 2023

వెబ్‌సైట్: www.vmmc-sjh.nic.in

Flash...   BARC : బాబా అణు పరిశోధనా కేంద్రం లో 4374 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.

How to Prepare ?

సిలబస్ విద్యార్హత ఆధారంగా ఉంటుంది. కాబట్టి సబ్జెక్టులపై గట్టి పట్టు సాధించండి.

పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించాలి. దీన్ని ప్రాక్టీస్ చేయడానికి, మీరు వివిధ వెబ్‌సైట్‌లలో ఉచితంగా లభించే ఆన్‌లైన్ పరీక్షలను వ్రాయవచ్చు.

ప్రకటించిన వివరాల ప్రకారం… నవంబర్ నాలుగో వారంలో పరీక్ష జరగనుంది. అంటే.. దాదాపు నెల రోజుల సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాలి.

ఏ సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించాలి, టైమ్ టేబుల్ తయారు చేసి కచ్చితంగా అమలు చేయాలి.