ఇండియాలో టీవీలు తయారు చేయం.. టీవీలు అమ్మం : వన్ ప్లస్, రియల్ మీ

ఇండియాలో టీవీలు తయారు చేయం.. టీవీలు అమ్మం :  వన్ ప్లస్, రియల్ మీ

ఇక నుంచి ఇండియాలో మా కంపెనీకి చెందిన టీవీలను విక్రయిస్తాం.. ఇప్పటివరకు తయారు చేసిన టీవీలనే విక్రయిస్తాం.. ఇక నుంచి ఇండియాలో కొత్త టీవీలను తయారు చేయడం లేదు..

ఇండియా వాళ్లకు అమ్మేస్తోంది.. ఇండియన్ మార్కెట్‌లో టీవీ వ్యాపారాన్ని వదిలేస్తున్నాం.. ఈ మాటలు చెబుతున్నది ఎవరో కాదు.. టాప్ బ్రాండ్ కంపెనీలు వన్ ప్లస్, రియల్‌మీ… అవును.. ఈ రెండు కంపెనీలు అంటూ వార్తలు వస్తున్నాయి. టీవీ మార్కెట్ నుండి నిష్క్రమిస్తున్నారు. రెండు సంస్థలు అధికారికంగా ఎందుకు, ఏం..కారణాలు ప్రకటించనప్పటికీ జాతీయ మీడియాలో దీనిపై వార్తలు వస్తున్నాయి.

భారతదేశంలో స్మార్ట్ టీవీ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలో పలు మొబైల్ కంపెనీలు టీవీ మార్కెట్ లోకి అడుగుపెట్టాయి. అందులో రియల్ మీ కూడా ఒకటి. 10 వేల రూపాయలకే స్మార్ట్ టీవీగా లాంచ్‌లో ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ప్రీమియం బ్రాండెడ్ సెల్ ఫోన్ల తయారీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వన్ ప్లస్ కంపెనీ.. స్మార్ట్ టీవీ మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టింది. సెల్ ఫోన్ మార్కెట్ లో జోరు కొనసాగిస్తున్న ఈ రెండు కంపెనీలు టీవీ మార్కెట్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయని మార్కెట్ వర్గాల విశ్లేషణ.

స్మార్ట్ టీవీ మార్కెట్లో రోజురోజుకూ పోటీ తీవ్రంగా ఉందని.. పలు కంపెనీల రాకతో.. వన్ ప్లస్, రియల్ మీ టీవీల విక్రయాలు తగ్గుముఖం పట్టాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. Samsung, LG, Sony, TCL, UV వంటి కంపెనీల నుంచి గట్టి పోటీ నెలకొనడంతో.. కొన్నేళ్లుగా వాటి విక్రయాలు తగ్గుముఖం పట్టాయని వ్యాపార విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మొబైల్ మార్కెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టేందుకు టీవీ రంగాన్ని వదిలిపెట్టాలని కంపెనీ నిర్ణయించింది.

అయితే ఇప్పటికే వన్‌ప్లస్, రియల్‌మీ టీవీలను కొనుగోలు చేసిన వినియోగదారులకు ఎలా సేవలు అందిస్తాయో.. మరో కంపెనీతో టైఅప్ అవుతాయో లేదో.. టీవీ విడిభాగాల సంగతేంటి అనే దానిపై ఆ రెండు కంపెనీలు వివరణ ఇవ్వాల్సి ఉంది. .. రాబోయే కొద్ది రోజుల్లో OnePlus మరియు Realme టీవీలు మార్కెట్ నుండి అదృశ్యం కావడం ఖాయంగా కనిపిస్తోంది

Flash...   Modification of SSC Public Examinations, 2022 GO 79 Communicaiton