Online Certificate Courses: ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులకు దరఖాస్తులు

Online Certificate Courses: ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులకు దరఖాస్తులు

గుంటూరు రూరల్ : ఆచార్య ఎన్ జిరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్సులకు ఆసక్తి ఉన్న రైతులు, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జి.రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నవంబరు నుంచి ప్రారంభం కానున్న పప్పుధాన్యాలు, సెరికల్చర్, వర్మీకంపోస్ట్, బయో ఫెర్టిలైజర్స్ వంటి ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కోర్సుల తరగతులు 8 వారాలు (2 నెలలు) కొనసాగుతాయని చెప్పారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఆండ్రాయిడ్ ఫోన్, ట్యాబ్ లేదా కంప్యూటర్ కలిగి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఒక్కో కోర్సుకు రూ.1500 చొప్పున ఫీజు చెల్లించి అక్టోబర్ నెలాఖరులోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ లేదా 8008788776, 8309626619, 9110562727 నంబర్‌లను కార్యాలయ వేళల్లో మాత్రమే సంప్రదించండి.

Flash...   AP MAHILA POLICE SUBORDINATE SERVICE RULES 2021 GO MS NO 1. Dt: 12.01.2022