ఏలూరు (ఆర్‌ఆర్‌పీటీ): జిల్లాలోని హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో పీజీటీలుగా పని చేసేందుకు అర్హులైన, ఆసక్తి ఉన్న ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.శ్యామ్ సుందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆసక్తి గల ఉపాధ్యాయులు నవంబర్ 2వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట లోపు ఒరిజినల్ సర్టిఫికెట్లతో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు.
జిల్లాలోని కమవరపుక్కోట, టి.నరసాపురం పాఠశాలలు, ఫిజిక్స్ పీజీటీ, నిడమర్రు, కానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో సివిక్స్ పీజీటీ, సిద్ధాంతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల