33 ఏళ్ల సర్వీసుతో ఉద్యోగుల రిటైర్మెంట్ ? ఏపీ సర్కార్ క్లారిటీ ఇదే..!

33 ఏళ్ల సర్వీసుతో ఉద్యోగుల రిటైర్మెంట్ ? ఏపీ సర్కార్ క్లారిటీ ఇదే..!

ఏపీలో గతంలో అమల్లో ఉన్న సీపీఎస్‌ను ప్రభుత్వం రద్దు చేసి, దాని స్థానంలో గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదించిన బిల్లు అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం పొందడంతో చట్టంగా మారింది.

అయితే ఏపీ గ్యారెంటీ పెన్షన్ యాక్ట్ 2023లో 33 ఏళ్ల సర్వీసుతో పదవీ విరమణ పొందాలనే నిబంధన ఉందని.. తాజాగా ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది.

AP గ్యారెంటీ పెన్షన్ చట్టం 2023లో 33 ఏళ్ల సర్వీసుతో తప్పనిసరి పదవీ విరమణ నిబంధన ఉందని జరుగుతున్న ప్రచారంపై ఆర్థిక శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ SS రావత్ క్లారిటీ ఇచ్చారు. GPS చట్టంలో అలాంటి నిబంధన ఏదీ లేదన్నారు. ఈ మేరకు జీపీఎస్ చట్టంలో పొందుపరిచిన నిబంధనలను ఆయన స్పష్టం చేశారు. దీనిపై ఎలాంటి అపోహలు అవసరం లేదు. దీంతో ఉద్యోగులకు గ్యారెంటీడ్ పెన్షన్ చట్టంలోని రిటైర్మెంట్ క్లాజుపై క్లారిటీ వచ్చింది.

జీపీఎస్ చట్టంలోని క్లాజ్ 4లో పేర్కొన్న అంశాలపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో.. ఇవన్నీ కేవలం ఏయే దశల్లో జీపీఎస్ వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పడానికేనని అధికారులు తెలిపారు. పాత పెన్షన్ విధానంలో ఉన్న అంశాలనే జీపీఎస్ విధానంలో కూడా పొందుపరిచామని తెలిపారు. ఈ నిబంధనలను గతంలో 1961లో రూపొందించారని గుర్తు చేసిన ఆయన.. 1980లో సవరించి ఇప్పుడు జీపీఎస్ చట్టంలో చేర్చారని చెప్పారు.

అంతే కాదు పాత పింఛను విధానంలో 33 ఏళ్లు సర్వీసు ఉంటేనే పూర్తి పెన్షన్‌కు అర్హులని, స్వచ్ఛంద పదవీ విరమణ నేపథ్యంలో 20 ఏళ్లు సర్వీసు చేసిన తర్వాతే పింఛను పొందాలనే నిబంధనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అదే నిబంధనను ఇప్పుడు జీపీఎస్ లోనూ చేర్చినట్లు వెల్లడించారు. అందువల్ల గ్యారెంటీ పెన్షన్ స్కీమ్‌లో 33 ఏళ్ల సర్వీసు ఉన్న ఉద్యోగులను రిటైర్ చేయడం సరికాదు.

Flash...   Health Tips: గురకే కదా అని లైట్ తీసుకోకండి.. ఈ రిస్క్ ఉందని మీరు కనీసం గెస్ కూడా చేయలేరు